యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ESA)తో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) శనివారం కీలక ఒప్పందం చేసుకుంది. వ్యోమగాములకు ట్రైనింగ్ ఇవ్వడం, పలు పరిశోధనలకు సంబంధించిన పనులకు సహకరించుకునేందుకు ఈ ఒప్పందంపై ఇరు సంస్థలు సంతకాలు చేసుకున్నాయి. ఈ రెండు సంస్థలు కూడా మానవ అన్వేషణ, పరిశోధనల్లో సహరించుకుంటాయని ఇస్రో వెల్లడించింది. Also Read: అయ్యో.. హుండిలో పడిపోయిన ఐఫోన్.. ఇవ్వమంటున్న ఆలయ అధికారులు కలిసి పనిచేస్తాయి వ్యోమగామి ట్రైనింగ్‌తో పాటు ప్రయోగాలు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS)లో ఈసా సౌకర్యాల వినియోగం, మానవ, బయోమెడికల్ పరిశోధన ప్రయోగాల అమలు విషయాల్లో సహకరించుకుంటాయని పేర్కొంది. అలాగే విద్యా, ప్రజా అవగాహన కార్యకలాపాలపై కూడా కలిసి పనిచేస్తాయని తెలిపింది. అంతేకాదు ఆక్సియం-4 మిషన్‌లో ఇస్రో గగన్‌యాన్, ఈసా వ్యోమగాములు ఉన్నారని చెప్పింది. ఈ మిషన్‌లో ఇండియన్ శాస్త్రవేత్తలు తయారుచేసిన ఆవిష్కరణలను ఐఎస్ఎస్‌లో వినియోగిస్తామని పేర్కొంది. Also Read: ఈ శాంటా క్లాస్ అసలైంది కాదా.. ఆయన పుర్రె ఆధారంగా డిజైన్ చేశారా! రోడ్‌మ్యాప్ సిద్ధం ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ.. మానవ సహిత స్పేస్ ఫ్లైట్‌కి ఇస్రో రోడ్‌మ్యాప్ సిద్ధం చేసిందని తెలిపారు. అలాగే భారత్ తన సొంతగానే అంతరిక్ష కేంద్రాన్ని కూడా నిర్మించనుందని పేర్కొన్నారు. తాజాగా చేసుకున్న ఒప్పందం ఇరు సంస్థల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. భవిష్యత్తులో మానవ అంతరిక్ష కార్యకలాపాల కోసం నిరంతరం సహకారాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. Also Read: శ్రీతేజ్ ఇప్పట్లో కోలుకోడు.. నాకే భయమేసింది: కోమటిరెడ్డి ఎమోషనల్! Also Read: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది 17 మంది