/rtv/media/media_files/2025/04/25/HuLsrds7ep2od9I9pncL.jpg)
Pakistan Started Firing
పాకిస్తాన్ కయ్యానికి కాలు తెగ దువ్వుతోంది. ఉగ్రవాదులను ప్రేరేపించి భారత్ లో టూరిస్టుల ప్రాణాలు పోయేలా చేసిందే కాకుండా ఇప్పుడు భారత్ తో యుద్దం చేయడానికి ఉవ్విళ్లూరుతోంది. ఇండియా సంయమనంతో ఉండాలని చూస్తోంది కానీ ఆ దేశం మాత్రం అలా అనుకోవడం లేదు. నిన్న రాత్రి నుంచి నియంత్రణ రేఖ దగ్గర కాల్పుల తో చెలరేగిపోతోంది. అయితే దీనికి సిద్ధంగానే ఉన్న భారత సైన్యం వాటికి ధీటుగా సమాధానమిస్తోంది. భారత్, పాక్ సీజ్ ఫైర్ ఎత్తేసారని వార్తలు వచ్చాయి. అయితే ఇరు దేశాలు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు పాకిస్తాన్ చర్యల వలన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం ఉంది.
కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు..
పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత దేశం మొత్తం కోపంతో రగిలిపోతోంది. ఈ దాడికి ప్రతిస్పందనగా భారతదేశం పాకిస్తాన్‌పై అనేక ఆంక్షలు విధించింది. ఇందులో సింధు జల ఒప్పందం, పాకిస్తానీయుల వీసాల రద్దు, భారతదేశం నుంచి పాకిస్తానీయులు వెళ్ళిపోవాలని వంటి ఆంక్షలను విధించింది.ఇదే సమయంలో ఉగ్రదాడికి పాల్పడిన వారు, దానికి సహకరించిన వాళ్ళు కూడా 'నాశనం' చేయబడతారని ప్రధాని మోదీ గురువారం స్పష్టం చేశారు. ఇంత జరిగినా పాక్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. భారత్ లానే ఆ దేశం కూడా ఒప్పందాలను రద్దు చేసుకుంది. దౌత్య సంబంధాలను తెగ్గొట్టుకుంది. అదికాక ఇప్పుడు బార్డర్ లో కాల్పులకు తెర తీసింది. నిన్న రాత్రి నుంచి పలు చోట్ల కాల్పులు జరుపుతూనే ఉంది పాక్ సైన్యం. అయితే ఇప్పటికే సిద్ధంగా భారత సిపాయిలు వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు రఫెల్ యుద్ధ విమానాలు కూడా బయలుదేశాయి. అలాగే సముద్రంలో ఐఎన్ఎస్ నౌక యుద్ధానికి రెడీగా ఉంది.
కాశ్మీర్‌కు ఆర్మీ చీఫ్
తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్విదేది నేడు జమ్మూకశ్మీర్‌కు వెళ్లనున్నారు. శ్రీనగర్, ఉదమ్‌పూర్‌లో పర్యటించనున్నారు. కశ్మీర్ లోయలోని ఆర్మీ కమాండర్లు, మిగతా భద్రతా ఏజెన్సీల ప్రతినిధులతో భేటీ కానున్నారు.
today-latest-news-in-telugu | india | pakistan | border | firing