H-1B Visa: అమెరికా వీసా ఆశలపై నీళ్లు.. భారతీయులకు 18 నెలల నిరీక్షణ తప్పదా?

అమెరికా వీసా కోసం వేచి చూస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు మరో చేదు వార్త ఎదురైంది. భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయాల్లో నెలకొన్న అపాయింట్‌మెంట్ బ్యాక్‌లాగ్స్ కారణంగా H-1B వీసా ఇంటర్వ్యూ స్లాట్లు ఏకంగా 2027వ సంవత్సరానికి వాయిదా పడ్డాయి.

New Update
_H-1B visas

అమెరికాలో డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) ప్రభుత్వం వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తోంది. విదేశీ ఉద్యోగులపై ఆంక్షలు విధిస్తోంది. హెచ్‌–1బీ(h1b visa) సహా ఇతర వీసాల దరఖాస్తుదారులపైనా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. గత కొంతకాలంగా అమెరికా వీసా కోసం వేచి చూస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు భారీ ఊరట లభిస్తుందని ఆశిస్తే, మరో చేదు వార్త ఎదురైంది. భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయాల్లో నెలకొన్న అపాయింట్‌మెంట్ బ్యాక్‌లాగ్స్ కారణంగా H-1B వీసా ఇంటర్వ్యూ స్లాట్లు ఏకంగా 2027వ సంవత్సరానికి వాయిదా పడ్డాయి.

Also Read :  సముద్రంలో మునిగిన నౌక.. 15 మంది జలసమాధి..28 మంది గల్లంతు!

సాధారణంగా వీసా స్టాంపింగ్ కోసం అపాయింట్‌మెంట్ దొరకడమే కష్టంగా మారిన తరుణంలో, ఇప్పటికే స్లాట్లు బుక్ చేసుకున్న వారికి అమెరికా అధికారులు షాక్ ఇచ్చారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లోని కాన్సులేట్‌లలో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఇప్పటికే ఉన్న అపాయింట్‌మెంట్లను అధికారులు 18 నెలల పాటు ముందుకు జరిపారు. గతేడాది డిసెంబర్ నుంచి ఈ జాప్యం మొదలైంది. మొదట 2026 మార్చికి మార్చిన స్లాట్లు, ఆ తర్వాత జూన్, అక్టోబర్ నెలలకు మారాయి. ఇప్పుడు తాజాగా ఈ గడువును 2027కు పొడిగించారు. దీనివల్ల ముఖ్యంగా భారత్‌కు చెందిన వేలాది మంది ఐటీ నిపుణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పనులపై ఇంటికి వెళ్లాలనుకున్న వారు కూడా ఇప్పుడు తమ ప్లాన్లను రద్దు చేసుకుంటున్నారు. - america visa update

Also Read :  అమెరికాలో మంచు తుపాను బీభత్సం.. 3 లక్షల మందికి పైగా

నిపుణుల హెచ్చరిక: భారత్‌కు రావొద్దు!

భారతీయులు ఇతర దేశాల్లోని అమెరికా కాన్సులేట్లలో వీసా స్టాంపింగ్‌ చేయించుకొనే అవకాశం గతంలో ఉండేది. ట్రంప్‌ సర్కార్‌ ఆ వెసులుబాటును కూడా రద్దు చేసింది. ఎవరైనా సరే సొంత దేశంలోనే వీసా స్టాంపింగ్‌ కోసం ప్రయత్నించాలని తేల్చిచెప్పింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇమ్మిగ్రేషన్ నిపుణులు అమెరికాలో ఉన్న హెచ్‌-1బీ(donald trump h1b visa news) ఉద్యోగులకు కీలక సూచనలు చేస్తున్నారు. స్టాంపింగ్ కోసం ఇప్పుడు భారత్‌కు వెళ్లడం ఏమాత్రం మంచిది కాదని వారు హెచ్చరిస్తున్నారు. "ఒకవేళ మీరు స్టాంపింగ్ కోసం భారత్‌కు వెళ్లి, అక్కడ ఇంటర్వ్యూ రద్దయితే లేదా వాయిదా పడితే.. తిరిగి అమెరికా వెళ్లడం అసాధ్యం అవుతుంది. ఇది మీ ఉద్యోగానికి కూడా ముప్పు తెచ్చే అవకాశం ఉంది."

‘అమెరికన్ బజార్’ నివేదికల ప్రకారం, గత నెలలో స్టాంపింగ్ కోసం భారత్ వచ్చిన చాలా మంది ఉద్యోగుల ఇంటర్వ్యూలు చివరి నిమిషంలో రద్దయ్యాయి. కనీసం సాధారణ అపాయింట్‌మెంట్లు కూడా 2027 వరకు అందుబాటులో లేవని స్పష్టమవుతోంది. భారత్‌లో వీసా వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడానికి అమెరికా విదేశాంగ శాఖ అదనపు సిబ్బందిని నియమిస్తున్నట్లు గతంలో ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు మెరుగుపడటం లేదు. డిజిటల్ వీసా పద్ధతులు, డ్రాప్‌బాక్స్ సదుపాయం ఉన్నప్పటికీ, ఇంటర్వ్యూ అవసరమైన వారికి మాత్రం ఈ 2027 గడువు ఒక పీడకలలా మారింది. ప్రస్తుతానికి అమెరికాలోనే ఉండి వీసా పొడిగింపు పొందే మార్గాలను అన్వేషించడమే ఉత్తమమని నిపుణులు సలహా ఇస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు