US Winter Storm: అమెరికాలో మంచు తుపాను బీభత్సం.. 3 లక్షల మందికి పైగా

అమెరికాను భయంకరమైన మంచు తుపాను వణికిస్తోంది. ఫెర్న్ పేరుతో విరుచుకుపడుతున్న ఈ తుపాను కారణంగా దేశవ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.

New Update
us

అమెరికా(america)ను భయంకరమైన మంచు తుపాను(US winter storm) వణికిస్తోంది. ఫెర్న్(Fern Storm) పేరుతో విరుచుకుపడుతున్న ఈ తుపాను కారణంగా దేశవ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. దక్షిణ రాష్ట్రాల నుంచి ఈశాన్య ప్రాంతాల(india) వరకు విస్తరించిన ఈ మంచు బీభత్సం వల్ల సుమారు పది లక్షల ఇళ్లు, వ్యాపార సముదాయాలు అంధకారంలో మునిగిపోయాయి. భారీగా కురుస్తున్న మంచు, గడ్డకట్టే చలి కారణంగా విద్యుత్ లైన్లు తెగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ముఖ్యంగా టేనస్సీ, లూసియానా, మిసిసిపి, టెక్సాస్, జార్జియా రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఒక్క టేనస్సీలోనే 3 లక్షల మందికి పైగా కరెంట్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ గ్రిడ్‌లపై ఒత్తిడి పెరగడంతో అమెరికా ఇంధన శాఖ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. జనవరి చివరి వరకు ఈ చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Also Read :  చైనా జనరల్ దేశద్రోహం.. అమెరికాకు అణు డేటా లీక్!

18,000 విమానాలు రద్దు 

మంచు తుపాను ప్రభావం విమానయానంపై తీవ్రంగా పడింది. ఇప్పటివరకు సుమారు 18,000 విమానాలు రద్దవ్వగా, మరో 30,000 సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. వాషింగ్టన్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ సహా పలు ప్రధాన విమానాశ్రయాలు మూతపడ్డాయి. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో ప్రయాణాలు ప్రమాదకరంగా మారాయి. 300కు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. 

తీవ్రమైన చలి కారణంగా మరణాల సంఖ్య పెరుగుతోంది. టెక్సాస్, లూసియానా, న్యూయార్క్ నగరాల్లో పలువురు చలికి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్ సెంట్రల్ పార్క్‌లో దాదాపు 9 అంగుళాల మంచు కురవగా, పిట్స్‌బర్గ్‌లో గత 15 ఏళ్లలో లేనంత భారీ హిమపాతం నమోదైంది. ప్రభుత్వం అనేక చోట్ల వార్మింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.

ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలు, కోర్టులు,  ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయబడ్డాయి. ఫిలడెల్ఫియా, బోస్టన్, నాష్‌విల్లే, న్యూయార్క్, డల్లాస్‌లోని  అనేక విశ్వవిద్యాలయాలు సోమవారం లేదా మంగళవారం వరకు మూసివేయబడతాయని ప్రకటించాయి. న్యూ మెక్సికో నుండి మైనే వరకు దాదాపు 2,000 మైళ్ల వరకు తుఫాను విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాలలో హిమపాతం తగ్గినప్పటికీ, ప్రమాదకరమైన చలి పరిస్థితులు కొనసాగుతాయని హెచ్చరించింది.

అటు మరికొన్ని ప్రాంతాల్లో మంచును ప్రజలు ఆస్వాదిస్తున్నారు. ఉష్ణ్రోగతలు తీవ్రంగా ఉన్నా బయటకొచ్చిన మరి మంచులో ఆటలు ఆడుకుంటున్నారు. ఓక్లామా నగరంలో స్లైడింగ్‌ చేస్తూ ఆనందంగా గడుపుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా మంచులో ఉల్లాసంగా సేద తీరుతున్నారు.

Also Read :  అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. టేకాఫ్ అవుతుండగా రన్‌వేపై

Advertisment
తాజా కథనాలు