/rtv/media/media_files/2025/11/11/viral-reddit-post-predicted-red-fort-blast-hours-before-tragedy-2025-11-11-15-33-03.jpg)
Viral Reddit post predicted Red Fort blast hours before tragedy
ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన బాంబు దాడిలో 12 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. మరో 20 మంది గాయాలపాలయ్యారు. అయితే ఈ పేలుడు ఘటనకు 3 గంటల ముందు Reddit లో ఓ విద్యార్థి చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ దాడికి ముందు ఆ మెట్రో స్టేషన్ మీదుగా వెళ్తున్న తనకు ఎప్పుడూ లేనంతగా భద్రత దళాలు చూసినట్లు పేర్కొన్నారు.
Also Read: ఢిల్లీ పేలుళ్లు.. వారిని వదిలిపెట్టం.. ప్రధాని మోదీ, రాజ్నాథ్ సింగ్ సంచలన వార్నింగ్!
ఆ యూజర్ 12వ తరగతి చదువుతున్నట్లు చెప్పాడు. '' నేను ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాను. మెట్లో స్టేషన్ సమీపంలో ఎప్పుడూ లేనంతగా పోలీసులు, ఆర్మీ సిబ్బంది, మీడియా కనిపించింది. నేను మెట్రోలో వెళ్తున్నప్పుడు ఇంతమంది సైన్యాన్ని కూడా ఎప్పుడు చూడలేదు. ఈరోజు అక్కడ ఏం జరుగబోతుంది ?'' అని ఆ పోస్టులో రాసుకొచ్చాడు. సాయంత్రం 4 గంటలకు ఈ పోస్టు పెట్టగా.. మూడు గంటల్లోనే అక్కడ కారులో బాంబు దాడి జరిగింది.
This was posted on reddit 3 hours before the Red fort attack… pic.twitter.com/jFiHAhBiUf
— Aryan Vaish (@sofunnyanii) November 11, 2025
Follow Us