IT Jobs: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఆ కంపెనీలు కూడా..!

అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు బిగ్ షాక్ ఇచ్చింది. వార్షిక వేతనాల పెంపును వాయిదా వేసింది. 2023 నవంబర్‌లో చివరిసారి జీతాలు పెంచగా ప్రస్తుతం ఆర్థిక అనిశ్చితి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని కంపెనీల పరిస్థితి ఇలాగే ఉంది. 

New Update
TCS-Infosys:టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ సంస్థల్లో భారీగా ఉద్యోగులకు ఉద్వాసన..ఈ సారి ఎంతమందంటే!

Infosys Annual Salary Delay

IT Jobs: అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్(Infosys) తమ ఉద్యోగులకు బిగ్ షాక్ ఇచ్చింది. వార్షిక వేతనాల పెంపును(Infosys Salary Hikes) వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. 2023 నవంబర్‌లో జీతాలు పెంచిన బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ స్థూల ఆర్థిక అనిశ్చితి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని కంపెనీల పరిస్థితి ఇలాగే ఉంది. 

HCLTech, L&T.. 

ఇక మాములుగా కొత్త యేడాది మొదట్లోనే జీతాలు పెంచుతుంటాయి ఐటీ కంపెనీలు. కానీ ఈ సంవత్సరం క్లయింట్ పేమెంట్స్ ఆలస్యం, మైక్రో ఎకనామిక్ అనిశ్చితి కారణంగా ఐటీ సేవల రంగంలో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. దీంతో వేతనాల పెంపు ఆలస్యమవుతోందని తెలుస్తోంది. క్యూ4లో అక్టోబర్ 17న దశలవారీగా శాలరీ పెంచేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు ఇన్ఫోసిస్‌ వెల్లడించింది. జనవరిలో కొంత పెంచి మిగిలింది ఏప్రిల్‌లో చెల్లిస్తామని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేష్ సంఘ్‌రాజ్కా చెప్పారు. ఇన్ఫోసిస్ నికర లాభం మూడు నెలలకు 2.2 శాతం పెరిగడంతో రూ. 6,506 కోట్లకు చేరింది. భారీ స్థాయిలో ఖర్చు తగ్గించడంతో 10 బేసిస్ పాయింట్లు మెరుగయ్యాయని తెలిపారు. 

ఇది కూడా చదవండి: Telangana: రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన..

ఆర్థిక ఇబ్బందుల్లో పలు కంపెనీలు.. 

ఇక కేవలం ఇన్ఫోసిస్ మాత్రమే కాదు..HCLTech, LTIMindtree, L&T టెక్ సర్వీసెస్ సైతం ఆర్థిక ఇబ్బందులో ఉన్నట్లు సమాచారం. అంతేకాదు ఈ కంపెనీలు గత ఆరు నెలలుగా ఖర్చులను భారీగా తగ్గించుకున్నాయట. మూడు నెలల ఇంక్రిమెంట్లను కూడా దాటవేసినట్లు తెలుస్తోంది. అలాగే ఉద్యోగుల మధ్య కూడా వేతనాల పెంపు విషయంలో భారీ వ్యత్యాసం ఉంటుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనీకంట్రోల్ డేటా ప్రకారం టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేతనాలు గత ఐదేళ్లలో 160% పెరగగా.. ఫ్రెషర్స్ శాలరీలు కేవలం 4 శాతమే పెరగడంపై ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో TCS, Infosys, HCLTech, Wipro, Tech Mahindra సీఈవోల జీతం రూ. 84 కోట్లు పెరగగా.. కొత్త ఉద్యోగుల జీతాలు రూ.4 లక్షలు పెరిగాయట.

ఇది కూడా చదవండి: WTC: 2025-27 షెడ్యూల్ రిలీజ్.. భారత్ ఎన్ని మ్యాచ్‌లు ఆడనుందంటే!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు