Telangana: రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన..

తెలంగాణలో సవరించిన ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 35,27,925 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,66,41,489 మంది పురుషులు ఉండగా.. 1,68,67,735 మహిళా ఓటర్లు ఉన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Voter List

Voter List

తెలంగాణలో సవరించిన ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 35,27,925 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,66,41,489 మంది పురుషులు ఉండగా.. 1,68,67,735 మహిళా ఓటర్లు ఉన్నారు. అలాగే 2,829 మంది థర్డ్ జెండర్‌ ఓటర్లు ఉన్నారు. ఓటర్లలో పురుషుల కంటే మహిళలలే 2 లక్షలకు పైగా ఉన్నారు. 

Also Read: HMPV వైరస్ కరోనా కంటే ప్రమాదకరమా?.. వైద్యులు ఏం చెబుతున్నారు?

ఇందులో 18 - 19 ఏళ్లున్న ఓటర్లు 5,45,026 మంది ఉన్నా రు. 85 ఏళ్లు దాటిన సీనియర్ ఓటర్లు 2,22,091, ఎన్ఆర్‌ఐ ఓటర్లు 3,591, ప్రత్యేక ప్రతిభావంతులు 5,26,993 మంది ఓటర్లు ఉన్నారు. అయితే శేరిలింగంపల్లిలో అత్యధికంగా 7,65,982 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే అత్యల్పంగా భద్రాచలంలో 1,54,134 మంది ఓటర్లు ఉన్నారు. 

Also Read: నవోదయలో దారుణం.. బాలికలపై నలుగురు టీచర్ల లైంగిక దాడి!

ఇదిలాఉండగా తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నెల చివర్లో, అలాగే వచ్చే నెలలో దశల వారిగా ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో రేవంత్ సర్కార్ చెప్పిన సంగతి తెలిసిందే. 2024 ఫిబ్రవరి 29న రాష్ట్రంలో సర్పంచుల పదవీ కాలం ముగిసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి గ్రామాల్లో సర్పంచులు లేకుండానే ప్రత్యేకాధికారులతో పాలన సాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేబినెట్ విస్తరణ వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. కేబినెట్ విస్తరణ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ ప్రభుత్వం భావించింది. కానీ ఇంతవరకు కేబినెట్ విస్తరణ జరగలేదు. అయితే ఎన్నికలకు ముందే విస్తరణ చేస్తారా? లేదా తర్వాత చేస్తారా అనేదానిపై ఆసక్తి నెలకొంది. 

Also Read: కన్నీళ్లు పెట్టుకున్న సీఎం అతిషి.. వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు