WTC: డబ్ల్యూటీసీ తాజా షెడ్యూల్ రిలీజ్ అయింది. 2025-27కు సంబంధించిన టెస్టు మ్యాచ్‌ల వివరాలను ఐసీసీ విడుదల చేసింది. ఈ యేడాది జూన్‌లో భారత్-ఇంగ్లాండ్ సిరీస్‌తో మొదలై 2027 జూన్‌లో జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది. టీమ్ ఇండియా మొత్తం 18 టెస్టులు ఆడనుంది. ఇక 2023-25 షెడ్యూల్ జూన్ 11న ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య జరిగే ఫైనల్ పోరుతో ముగియనుంది.
ఇంగ్లాండ్ పర్యటనతో మొదలు..
ఇక 2025-27లో భారత్ మొత్తం మొత్తం 18 టెస్టులు ఆడనుంది. జూన్‌లో ఇంగ్లాండ్ పర్యటనతో టీమ్‌ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ప్రారంభమవుతుంది. ఇండియాలో 9, విదేశీ గడ్డపై 9 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇంగ్లాండ్‌తో 5, శ్రీలంకతో 2, న్యూజిలాండ్‌తో 2, వెస్టిండీస్‌తో 2, సౌతాఫ్రికాతో 2, ఆస్ట్రేలియాతో మరోసారి బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాంగంగా 5 టెస్టులు ఆడనుంది.
ఇది కూడా చదవండి: Navodaya: నవోదయలో దారుణం.. బాలికలపై నలుగురు టీచర్లు లైంగిక దాడి!
టీమ్‌ఇండియా షెడ్యూల్:
ఇంగ్లాండ్- భారత్: 5 టెస్టులు, జూన్-ఆగస్టు 2025
ఇండియా- వెస్టిండీస్: 2 టెస్టులు, అక్టోబర్ 2025
భారత్-సౌతాఫ్రికా: 2 టెస్టులు, నవంబర్-డిసెంబర్ 2025
శ్రీలంక- భారత్: 2 టెస్టులు, ఆగస్టు 2026
న్యూజిలాండ్- ఇండియా: 2 టెస్టులు, అక్టోబర్-డిసెంబర్ 2026
భారత్- ఆస్ట్రేలియా: 5 టెస్టులు, జనవరి-ఫిబ్రవరి 2027 (బోర్డర్-గావస్కర్ ట్రోఫీ)
A spirited effort from #TeamIndia but it's Australia who win the 5th Test and seal the series 3-1
— BCCI (@BCCI) January 5, 2025
Scorecard - https://t.co/NFmndHLfxu#AUSvIND pic.twitter.com/xKCIrta5fB
ఇది కూడా చదవండి: Atishi: కన్నీళ్లు పెట్టుకున్న సీఎం అతిషి.. వీడియో వైరల్
rdr