/rtv/media/media_files/2025/03/03/0OAKocbccEZCdlqQqZvw.jpg)
Baby
ఒడిశా (Odisha) లో దారుణం జరిగింది. అనారోగ్యం పేరుతో బాధపడుతున్న నెలరోజుల శిశువుపై కుటుంబ సభ్యులు కర్కశంగా వ్యవహరించారు. ఇనుప కడ్డీని కాల్చి శరీరంపై 40 వాతలు పెట్టారు. చివరికీ సమాచారం మేరకు గ్రామ పంచాయతీ సిబ్బంది చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. నవరంగాపూర్ జిల్లా గంభరిగూడ గ్రామంలో నెల రోజుల వయసున్న ఓ చిన్నారి వారం రోజులుగా తీవ్రమై జ్వరం, జలుబుతో బాధపడుతోంది.
Also Read: నట్టు, బోల్ట్ బిగించాల్సిందే.. రష్మికపై కాంగ్రెస్ ఎమ్మెల్యే బోల్డ్ కామెంట్స్!
Odisha Crime
ఎంతకీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో చిన్నారి కుటుంబ సభ్యులు మూఢనమ్మకాలకు ప్రభావితమయ్యారు. ఇనుప కడ్డీని కాల్చి శిశువు శరీరంపై 40 చోట్ల వాతలు పెట్టారు. ఆ తర్వాత చిన్నారి ఆరోగ్యం మరింత క్షీణించడంతో చివరికీ పంచాయతీ సిబ్బంది స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనారోగ్యానికి గురయ్యే చిన్నారులకు వేడి లోహంతో ముద్ర వేస్తే.. దుష్టశక్తులు పోతాయని అక్కడి వాళ్లు నమ్ముతారని.. అందుకే ఆ చిన్నారికి అలా జరిగిందని పోలీస్ అధికారులు తెలిపారు.
Also Read: ట్రంప్ పిలిస్తే మళ్లీ వెళ్లి మాట్లాడుతా.. జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు
చిన్నారి తల, కడుపై 40 వాతలు పెట్టినట్లు చెప్పారు. చివరికి సమాచారం మేరకు నవరంగాపూర్ జిల్లా వైద్యాధికారి డా.సంతోష్ కుమార్ పండా ఆస్పత్రికి వచ్చారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మారుమూల గ్రామల ప్రజలు మూఢనమ్మకాల బారిన పడకుండా ఉండేందుకు వాళ్లకి అవగాహన కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూసకోవాలని చెప్పారు.
Also Read: రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ పోస్టు .. డిలీట్ చేసిన ముస్లిం మహిళా నేత!
Also Read: ''గంగా జలాలు దానికి పనికిరావు''.. ఆర్థిక సర్వేలో సంచలన విషయాలు