Zelenskyy: ట్రంప్ పిలిస్తే మళ్లీ వెళ్లి మాట్లాడుతా.. జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు

లండన్‌లో లాంకస్టర్‌ హౌస్‌లో యూరప్‌ దేశాల అధినేతలు సమావేశమైయ్యారు. అందులో జెలెన్‌స్కీ, కెనడా ప్రధాని ట్రూడో, టర్కీ విదేశాంగ మంత్రి, నాటో చీఫ్‌ తదితరులు పాల్గొన్నారు. ట్రంప్‌, జెలెన్‌ స్కీ మధ్య వాగ్వాదం గురించి అందులో ప్రస్తావించారు.

New Update
Zelensky

Zelenskyy 1233 Photograph: (Zelenskyy 1233)

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీల మధ్య జరిగిన వాగ్వాదం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. లండన్‌లోని 200 ఏళ్ల పురాతన లాంకస్టర్‌ హౌస్‌లో ఆదివారం యూరప్‌ దేశాల అధినేతలు స్టార్మర్‌ నేతృత్వంలో సమావేశమై చర్చించారు. వారితోపాటు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, కెనడా ప్రధాని ట్రూడో, టర్కీ విదేశాంగ మంత్రి, నాటో చీఫ్‌ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ట్రంప్‌–జెలెన్‌ స్కీ మధ్య జరిగిన వాగ్వాదం గురించి ఇందులో ప్రస్తావించారు. అనంతరం జెలెన్‌స్కీ కింగ్‌ చార్లెస్‌తో భేటీ అయ్యారు. 

Also Read ; Adulterated milk: డేంజరస్ కెమికల్స్‌తో పాల తయారీ.. కల్తీని ఇలా కనిపెట్టండి..!

ఈ విషయంపై జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. అమెరికాతో సత్సంబంధాలను కాపాడుకుంటామని అన్నారు. ఖనిజాల ఒప్పందంలో గత వారం ఏకాభిప్రాయం కుదరలేదని, నిర్మాణాత్మక చర్చ కోసం ట్రంప్ ఆహ్వానిస్తే మరోసారి భేటీకి వెళ్తానని ఆయన తెలిపారు. సమస్యలు పరిష్కరించుకోవడానికి తాను సిద్ధమని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. మరోవైపు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ మాట్లాడుతూ.. ఐరోపా భద్రత కోసం నడుం బిగిద్దామని, ఉక్రెయిన్‌కు మంచి జరిగే ఒప్పందంతోనే ప్రతి దేశ భద్రత ఆధారపడి ఉందని అన్నారు. 

Also Read: Zelenskyy: మినరల్స్‌ డీల్‌కు సిద్ధమే, కానీ.. జెలెన్‌స్కీ సంచలన ప్రకటన

Advertisment
తాజా కథనాలు