Ganga River: ''గంగా జలాలు దానికి పనికిరావు''.. ఆర్థిక సర్వేలో సంచలన విషయాలు

2024-2025 ఆర్థిక సర్వే కీలక విషయాలు వెల్లడించింది. బిహార్‌లోని గంగా నది నీరు చాలా ప్రాంతాల్లో స్నానానికి పనికొచ్చేలా లేదని తెలిపింది. ఆ నీటిలో ఎక్కువ మోతాదులో మలి కొలిఫాం అనే బ్యాక్టిరియా అధిక మోతాదులో ఉన్నట్లు పేర్కొంది.

New Update
Ganga River

Ganga River

2024-2025 ఆర్థిక సర్వే కీలక విషయాలు వెల్లడించింది. బిహార్‌లోని గంగా నది నీరు చాలా ప్రాంతాల్లో స్నానానికి పనికొచ్చేలా లేదని తెలిపింది. ఆ నీటిలో ఎక్కువ మోతాదులో బ్యాక్టిరియా ఉన్నట్లు పేర్కొంది. ఇటీవలే రాష్ట్ర అసెంబ్లీలో ఈ సర్వేను ప్రవేశపెట్టారు. దీనిప్రకారం.. '' గంగా జలాల్లో మలి కొలిఫాం అనే బ్యాక్టిరియా అధిక మోతాదులో ఉంది. గంగా, దాని ఉప నదుల ఒడ్డున ఉన్న నగరాల నుంచి మురుగునీరు, వ్యర్థ జలాల విడుదల అవుతున్నాయి. 

Also Read: రైతులకు రూ.5కే శాశ్వత విద్యుత్‌ కనెక్షన్‌.. సీఎం కీలక ప్రకటన

అందువల్లే మలి కొలిఫాం బ్యాక్టిరియా పరిమితుల కంటే ఎక్కువగా పెరుగుతోంది. అంతేకాదు నీటి ఆమ్లత్వం, క్షారత్వం విలువ, బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్‌ గంగా నదితో పాటు ఉప నదుల్లో నిర్దేశించిన దాని కన్నా ఎక్కువగా ఉందని'' ఆర్థిక సర్వే వివరించింది. అయితే బిహార్‌ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు (BSPCB).. 34 ప్రదేశాల్లో గంగా నది నీటి నాణ్యతను 15 రోజులకొకసారి పర్యవేక్షిస్తున్నట్లు ఓ అధికారి చెప్పారు.  

Also Read: 4వేల ఎకరాల్లో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి - 80కి పైగా భవనాలు దగ్ధం..!

మరోవైపు ఈ ఆర్థిక సర్వేపై బీఎస్‌పీసీబీ చైర్మన్ డీకే శుక్లా కూడా స్పందించారు. '' గంగా నదిలో బ్యాక్టీరియా అధికంగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. గంగానదిలో చాలాచోట్ల కోలిఫాం, మలికోలిఫాం ఉనికి ఎక్కువగా ఉంది. అందుకే ఈ నీరు స్నానం చేసేందుకు ఉపయోగించలేం. రాష్ట్రంలో మురుగునీటి శుద్ధి కర్మాగారాలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటామని'' డేకే శుక్లా పేర్కొన్నారు. ఇదిలాఉండగా ఇటీవల ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరిగిన సంగతి తెలిసిందే. అయితే త్రివేణి సంగమంలో మలికొలిఫాం బ్యాక్టిరియా ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే . 

ఇది కూడా చూడండి: USAID: ట్రంప్ దెబ్బకు అబ్బా అంటున్న ట్రాన్స్‌జెండర్లు.. భారత్‌లోనూ మూతపడ్డ ఆ క్లినిక్‌లు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు