/rtv/media/media_files/2025/05/31/uKvcnj5LQdjyRZf3BRwz.jpg)
Stop leasing-turkish-aircraft
India-Turkey: భారత్, పాక్ యుద్ధంలో అన్ని దేశాలు తాలిబాన్లతో సహా అందరూ ఇండియాకే సపోర్ట్ చేశాయి. కానీ టర్కీ మాత్రం పాకిస్తాన్ కు మద్దతు పలికింది. పాకిస్తాన్ కు బాంబులు కూడా సప్లై చేసింది. దీంతో టర్కీపై భారత్ ప్రభుత్వం విరుచుకుపడింది. టర్కిష్ సంస్థ సెలెబిని భారత్ నుంచి గెంటేసింది. ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఈ సెలెబి సంస్థ కీలకంగా ఉంది. అంతేకాదు బాయ్‌కాట్ టర్కీ అంటూ సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అయ్యింది. టర్కీ టూర్లను రద్దు చేసుకోవాలని.. అలాగే ఆ దేశం నుంచి వాణిజ్యం ఆపేయాలంటూ నెటిజన్లు పోస్టులు చేశారు.
Also Read : రాష్ట్రంలో వాటిని అణిచివేయడానికి స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు
టర్కిష్ ఎయిర్ లైన్స్ తో సంబంధాలు..
ఇప్పుడు తాజాగా భారత ప్రభుత్వం మళ్ళీ టర్కీకి షాక్ ఇచ్చింది. కేంద్రం ఇండిగోను టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో తన విమానాల లీజు ఒప్పందాన్ని మూడు నెలల్లోగా ముగించాలని ఆదేశించింది. అయితే టర్కిష్ ఎయిర్‌లైన్స్ నుండి రెండు బోయింగ్ 777 విమానాలను లీజుకు తీసుకుని నడుపుతున్న ఇండిగోకు మే 31 వరకు అనుమతి ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీన్ని క్యాన్సిల్ చేసుకోమనడంతో ఇండిగో సందిగ్ధావస్థలో పడింది. మరో ఆరు నెలలు గడువు పొడిగించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖను కోరింది. కానీ దీనికి మంత్రిత్వశాఖ అనుమతి ఇవ్వలేదు. ఆగస్టు 31 వరకు అంటే మూడు నెలలు మాత్రమే గడువును ఇస్తామని చెప్పింది. అంతకంటే పొడిగించేది లేదని స్పష్టం చేసింది.
Also Read: కరోనా పేషేంట్ ని చంపేయ్.. ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకున్న ఆడియో వైరల్!
భారత్ పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తల సమయంలో కొన్ని దేశాలు పాక్ కు బహిరంగ మద్దతునిచ్చాయి. అందులో టర్కి(తుర్కియే) ఒక్కటి. భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన తుర్కియే కు భారత్ సాయం చేస్తే దాన్ని విస్మరించి పాక్ కు బహిరంగ మద్దతు ప్రకటించింది. అంతేకాక డ్రోన్లను అందించి మనదేశంపైకి ఉసిగొల్పింది. దీంతో రెండు దేశాల మధ్యనా దౌత్యపరమైన సంబంధాలు చెడిపోయాయి. దీని తరువాత ఇండియాలో బాయ్‌కాట్ టర్కీ క్యాంపెయిన్‌పై ఆ దేశ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఘాటుగా స్పందించారు. కాల్పుల విరమణను స్వాగతించినప్పటికీ పాకిస్తాన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. మంచి, చెడు సమయాల్లో పాక్ పక్షాన నిలబడతాం అన్నారు.
Also Read: cinema: కన్నప్ప హార్డ్ డ్రైవ్ ను మనోజ్ ఇంట్లో పని వాళ్ళే దొంగిలించారు..విష్ణు
Also Read: USA: ఎలాన్ మస్క్ కు ట్రంప్ వీడ్కోలు..స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన అధ్యక్షుడు