/rtv/media/media_files/2025/05/30/TPunhFd6ckmIrozFnru1.jpg)
Indian man attacked by tiger while taking selfie in terrifying video from Phuket
థాయ్‌లాండ్‌లోని ప్రముఖ టూరిస్ట్ ప్రాంతమైన టైగ్ కింగ్‌డమ్‌లో ఓ పర్యాటకుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. అతడు పులితో నడుస్తూ ఉండగా.. ఒక్కసారిగా అది దాడి చేసింది. దీంతో ఆ పర్యాటకుడు భయంతో కేకలు వేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అసలేం జరిగిందంటే భారత పర్యాటకుడు టైగర్ కింగ్‌డమ్‌కు వెళ్లాడు. అక్కడ గోలుసుతో కట్టిన పెద్దపులిని పట్టుకుని నడుస్తూ వస్తున్నాడు.
Tiger Attack On Man
My immediate reaction to this video was a chilling realization: that could have been me! This chilling video exposes a dangerous trend: many Indian tourists are lured into risky photo-ops with tigers in Thailand, often due to relentless peer pressure.
— Sanjay Madrasi Pandey | Ex-Reuters | Ex-Telegraph (@Sanjraj) May 29, 2025
These wild animals are… pic.twitter.com/QJnieFG0yH
Also Read: వ్యాన్ నదిలో పడి బీజేపీ నాయకురాలు గల్లంతు.. మరో 8మంది
అదే సమయంలో అతడి వెంట ఉన్న ట్రైనర్ కర్ర సాయంతో పులిని కూర్చోబెట్టేందుకు యత్నించగా.. పులి ఆ పర్యాటకుడిపై దాడి చేసింది. దీంతో భయంతో అతడు కేకలు వేస్తూ అరిచాడు. సిద్ధార్థ్ శుక్లా అనే వ్యక్తి మొదటగా తన ఎక్స్ ఖాతాలో దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేయగా అది వైరలవుతోంది. '' థాయ్‌లాండ్‌లో ఓ భారత పర్యాటకుడిపై పులి దాడి చేసినట్లు తెలుస్తోంది. టైగర్ కింగ్‌డమ్‌లో పులులకు ట్రైనింగ్ ఇస్తారు. పర్యాటకులన నుంచి డబ్బు వసూలు చేసి పులితో ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు ఛాన్స్ ఇస్తారు.
Also Read: బుద్ధి మార్చుకోని పాక్.. పుల్వామా తరహా దాడికి స్కెచ్.. ఇదిగో ప్రూఫ్!
ట్రైనింగ్ ఇచ్చిన పులితో అతడు సెల్ఫీ తీసుకుంటుండగా ఈ దాడి జరిగింది. స్వల్ప గాయాలతో అతడు'' అతడు చెప్పాడు. అయితే ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఎప్పుడు ఇలాంటి సాహసాలు చేయొద్దని.. వాటి పట్ల దయగా ఉండాలని, అవి కూడా అలాగే స్పందిస్తాయని ఓ యూజర్ రాసుకొచ్చాడు. జంతువులను బంధించిన తర్వాత వాటి దగ్గరకు వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వడం వల్ల ప్రమాదాలు జరుగుతాయనే విమర్శలు కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. కొన్ని అసహజ పరిస్థితుల్లో జంతువులు ప్రమాదకరంగా మారే ఛాన్స్ ఉంటుందని నెటిజన్లు చెబుతున్నారు.
Also Read: ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి..ఒకే వేదికపై ఉగ్రవాదులు, పాక్ మంత్రులు
Also Read : BJPలో దొంగలంతా ఒక్కటయ్యారన్న రాజాసింగ్.. కరీంనగర్ నుంచే నాపై వార్
Viral Video | telugu-news | rtv-news