Vijay and Trisha: 'త్రిషను వదిలేయ్ ముందు'.. విజయ్‌పై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

తమిళగ వెట్రి కజగం (TVK) చీఫ్‌ విజయ్‌పై బీజేపీ నేత నైనార్‌ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. విజయ్ రాజకీయంగా ఎదగాలి అనుకుంటే ముందు తన ఇల్లు దాటి బయటకు రావాలన్నారు. ముఖ్యంగా నటి త్రిషను వదిలేసి, వివాదాల నుంచి బయటపడాలంటూ విమర్శించారు. 

New Update
Bjp Leader Nainar Nagendran sensational Remarks On Actor Vijay And Trisha

Bjp Leader Nainar Nagendran sensational Remarks On Actor Vijay And Trisha

తమిళగ వెట్రి కజగం (TVK) చీఫ్‌ విజయ్‌పై బీజేపీ నేత నైనార్‌ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. రాబోయే ఎన్నికల్లో డీఎంకే, టీవీకే మధ్యే పోటీ ఉంటుందని విజయ్‌ అన్నారు. బీజేపీ లాంటి పార్టీలు రేసులో ఉండవని పేర్కొన్నారు. విజయ్ వ్యాఖ్యలపై స్పందించిన నాగేంద్రన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. విజయ్ రాజకీయంగా ఎదగాలి అనుకుంటే ముందు తన ఇల్లు దాటి బయటకు రావాలన్నారు. ముఖ్యంగా నటి త్రిషను వదిలేసి, వివాదాల నుంచి బయటపడాలంటూ విమర్శించారు. 

Also Read: సెప్టిక్ ట్యాంక్‌లో శవంగా తేలిన మహిళ.. కేసులో షాకింగ్ విషయాలు!

విజయ్‌కు రాజకీయాల పట్ల అవగాహన లేదని ఎద్దేవా చేశారు. కేవలం సినిమాల్లో డ్యాన్సులు చేసేందుకే ఆయన పరిమితమంటూ సెటైర్లు వేశారు. నటుడైనంత మాత్రాన ఓట్లు పడవని.. ప్రజల సమస్యలు తెలిసి ఉండాలన్నారు. నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలపై టీవీకే కార్యకర్తలు, విజయ్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. విజయ్ వ్యక్తిగత జీవితంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

విజయ్-త్రిష వివాదం

గత కొంతకాలంగా విజయ్, త్రిష కలిసి విదేశీ పర్యటనల్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీటికి సంబంధించి కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో వీళ్లిద్దరి మధ్య సంబంధంపై సినీ ఇండస్ట్రీలోనూ, ఇటు రాజకీయాల్లోనూ రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఇప్పటికే వీటిని విజయ్ ఖండించారు. ఓవైపు పార్టీని బలోపేతం చేసే పనిలో ఆయన ఉండగా, విపక్ష పార్టీల నేతలు విజయ్‌ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయడం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది.

Also Read: బంగ్లాదేశ్‌ ప్రధానిగా తారిక్‌ రెహమాన్‌.. ఈయన్ని డార్క్‌ ప్రిన్స్ అని ఎందుకంటారో తెలుసా ?

ఇదిలాఉండగా ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే లో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార, విపక్ష పార్టీలు రంగంలోకి దాగాయి. ఓటర్లను ఆకర్షించేందుకు విస్తృత ప్రచారాలు చేస్తున్నాయి. మరీ ఈసారి తమిళనాడు ప్రజలు ఎవరికి అధికారం అప్పగిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

Advertisment
తాజా కథనాలు