/rtv/media/media_files/2026/02/15/pm-modi-foreign-travel-2026-02-15-07-37-28.jpg)
పదేళ్లలో ప్రధాని మోదీ విదేశీ పర్యటన(PM Modi's foreign travel) ల ఖర్చు వివరాలు కేంద్రం లోక్‌సభ(lok-sabha) లో వెల్లడించింది. గడిచిన పదేళ్ల కాలంలో (2015-2025) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విదేశీ పర్యటనల కోసం భారత ప్రభుత్వం మొత్తం రూ.762.47 కోట్లు ఖర్చు(foreign travel expenses) చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు ప్రధానులుగా చేసిన వారు ఎవరూ కూడా ఇన్ని పర్యటనలు చేయలేదని స్పష్టం చేసింది.
Also Read : మహారాష్ట్రలో కీలక పరిణామం.. NCP విలీనం ఉండదన్న సంజయ్ రౌత్
ఏడాది వారీగా ఖర్చుల వివరాలు:
పర్యటనల ఖర్చు 2015లో రూ.91.5 కోట్లు ఉండగా, 2024లో అది రూ.109 కోట్లు దాటింది. అత్యధికంగా 2025లో రూ.175.19 కోట్లు ఖర్చయింది. ఆ ఏడాది ప్రధాని ఐరోపా, అమెరికా, ఆఫ్రికా, ఆసియా ఖండాల్లోని పలు దేశాల్లో విస్తృతంగా పర్యటించడమే దీనికి ప్రధాన కారణం. కోవిడ్ కారణంగా మోదీ 2020లో ఎటువంటి విదేశీ పర్యటనలు చేయలేదు.
విదేశాంగ శాఖ వివరణ ప్రకారం, ప్రధాని విదేశాలకు వెళ్ళినప్పుడు వసతి, భోజన వంటి ఆతిథ్య ఖర్చులను సదరు ఆతిథ్య దేశమే భరిస్తుంది. భారత ప్రభుత్వం కేవలం భద్రతా ఏర్పాట్లు, అధికార ప్రతినిధుల బృందం, మీడియా, ఇతర సాంకేతిక అవసరాల కోసం మాత్రమే నిధులు వెచ్చిస్తుంది. సాధారణంగా ప్రధాని వెంట 27 నుండి 72 మంది వెళ్తుండగా, గత ఏడాది ఒకేసారి ఐదు దేశాల పర్యటన సందర్భంగా ఈ సంఖ్య 95కి చేరింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదేళ్ల పదవీ కాలంలో కేవలం నాలుగు విదేశీ యాత్రలు చేశారని, వాటికి రూ.35.04 కోట్లు మాత్రమే ఖర్చయిందని కేంద్రం తెలిపింది. ప్రస్తుత ఖర్చులు పెరగడానికి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ తగ్గడం, పర్యటించిన దేశాల సంఖ్య మరియు ప్రయాణించిన దూరం వంటివి కారణాలని ప్రభుత్వం విశ్లేషించింది.
Also Read : సెప్టిక్ ట్యాంక్‌లో శవంగా తేలిన మహిళ.. కేసులో షాకింగ్ విషయాలు!
మోదీ విదేశీ యాత్రల ఖర్చు ఇలా..
సంవత్సరం ఖర్చు (రూ.కోట్లలో)
- 2015 = 91.5
- 2016 = 33.22
- 2017 = 44.27
- 2018 = 51.46
- 2019 = 7.76
- 2020 -(కొవిడ్ కారణంగా)
- 2021 = 36.11
- 2022 = 55.82
- 2023 = 93.63
- 2024 = 109.51
- 2025 = 175.19
- మొత్తం = 762.47 కోట్లు
Follow Us