Jio Recharge Plan: జియో మామ ఇచ్చిపడేశాడు భయ్యా.. తక్కువ ధరకే 98 రోజుల వ్యాలిడిటీ ప్లాన్!

జియో తన కస్టమర్లకు 3 నెలలకు పైగా ప్లాన్‌ను అందిస్తుంది. రూ. 899కి రీఛార్జ్ చేసుకుంటే.. 98 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అపరిమిత కాలింగ్, డైలీ 100 SMSలు, డైలీ 2GB డేటా ప్రయోజనాన్ని పొందుతారు. జియో హాట్‌స్టార్ ఉచిత మెంబర్‌షిప్ 90 రోజులు అందుబాటులో ఉంది.

New Update
jio cheapest recharge plan rs 319 free jiohotstar subscription 90 days

jio cheapest recharge plan

రిలయన్స్ జియో దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన టెలికాం కంపెనీలలో ఒకటిగా నిలిచింది. భారతదేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలలో జియో 5G నెట్‌వర్క్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో కోట్లాది మంది ఈ కంపెనీ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తున్నారు. ఒక రకంగా కోట్లాది మంది యూజర్లను కలిగి ఉన్నా.. గతంలో రీఛార్జ్ ధరలను భారీగా పెంచడంతో చాలా మంది ఇతర నెట్‌వర్క్‌లకు పోర్ట్ అయ్యారు. దీంతో జియో మళ్లీ తమ కస్టమర్లను రప్పించుకునేందుకు తరచూ ఆఫర్లు ప్రకటించి అట్రాక్ట్ చేస్తుంది. ఎప్పటి కప్పుడు కొత్త కొత్త ఆఫర్లు తీసుకొస్తుంది. మరి మీరు కూడా జియో యూజర్ అయితే.. తక్కువ ధరకు అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులో ఉంది.

Also Read :  పీవీకి అరుదైన గౌరవం

జియో తన కస్టమర్లకు 3 నెలలకు పైగా ప్లాన్‌ను అందిస్తుంది. అంటే దాదాపు 98 రోజుల ప్లాన్ అన్నమాట. ఈ ప్లాన్ వినియోగదారులను తరచు రీఛార్జ్‌ల నుండి విముక్తి చేయడంలో సహాయపడుతుంది. ఎక్కువ రోజుల వ్యాలిడిటీ, తక్కువ ధర కలిగిన రీఛార్జ్ ప్లాన్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

Also Read: విక్రమ్ మిస్రీపై ట్రోలింగ్‌.. అసదుద్దీన్ ఒవైసీ సంచలన ట్వీట్!

జియో 98 రోజుల రీఛార్జ్ ప్లాన్

రిలయన్స్ జియో తక్కువ ధరలో ఎక్కువ రోజులు వ్యాలిడిటీ కలిగిన రీఛార్జ్ ప్లాన్ తెచ్చింది. ఈ ప్లాన్ ధర రూ. 1000 కంటే తక్కువ. కేవలం రూ. 899కే వినియోగదారులకు అందిస్తుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత కాల్స్, SMS, డేటా ప్రయోజనాన్ని పొందుతారు. దీనితో పాటు OTT యాప్‌ల ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంది. 

Also Read :  DGMO చర్చల్లో భారత్, పాక్ డిమాండ్లు ఇవే

రూ.899 రీఛార్జ్ ప్లాన్

జియో రూ.899 ప్లాన్ 98 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అపరిమిత లోకల్, STD కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. రోజుకు 100 SMSలు పూర్తిగా ఉచితం. ఈ ప్లాన్‌తో మీరు రోజుకు 2GB డేటా ప్రయోజనాన్ని పొందుతారు. ఈ విధంగా మొత్తం 180GB డేటా వరకు పొందొచ్చు. బోనస్ డేటా 20GB వరకు లభిస్తుంది. దీంతో మొత్తం డేటా 200GB వరకు వస్తుంది. ఈ ప్లాన్‌తో 50GB వరకు Jio AI క్లౌడ్ స్టోరేజ్ పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. ఇది కాకుండా జియో హాట్‌స్టార్ ఉచిత మెంబర్‌షిప్ 90 రోజులు అందుబాటులో ఉంది. మీరు JioTV కి ఉచిత యాక్సెస్ కూడా పొందొచ్చు. 

Also Read: మోస్ట్ డేంజరస్ వీడియోలు.. గజగజ వణుకు పుట్టాల్సిందే!

jio recharge offers | jio-recharge-plan | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు