/rtv/media/media_files/2025/07/19/amit-shah-2025-07-19-19-50-18.jpg)
Amit Shah
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. భారత్.. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడుతూ ముందుకెళ్తోందని అన్నారు. 2027 నాటికి మన దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్‌లోని రుద్రపుర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. '' పదేళ్ల కాలంలో దేశాభివృద్ధి 60 శాతం పెరిగింది. దేశంలో 45 వేల కిలోమీటర్ల రైల్వే లైన్లు, రోడ్లు నిర్మించాం.
Also Read: డైనోసార్ అస్థిపంజరానికి వేలంలో రూ.260 కోట్లు
Amit Shah Says - India Becomes 3rd Largest Economy In The World 2027
అటల్ బిహారీ వాజ్‌పాయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశాన్ని 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిస్తే.. మోదీ దాన్ని నాలుగో స్థానానికి తీసుకొచ్చారు. త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుంది. ఇందుకోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల పక్కన నిలబెడతానని ప్రధాని మోదీ ప్రతిజ్ఞ చేశారు. ఇందుకోసం మేముందరం పనిచేస్తున్నాం. అలాగే ఉత్తరాఖండ్‌కు రాబోయే రోజుల్లో ప్రపంచం నలుమూలల నుంచి ఎక్కువగా పర్యాటకులు వచ్చేలా టూరిజంను అభివృద్ధి చేస్తాం.
Also read: 'ఉరిశిక్ష రద్దు.. నిమిష ప్రియ విడుదల!'
Also Read : వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్
ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం.. అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ర్యాంకింగ్ అంశంలో మనకన్నా ముందున్నాయి. మనం ఇలాగే కొనసాగితే 2027 నాటికి భారత్.. జర్మనీని దాటి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుంది. దీనికోసం మూలధన వ్యయాల పెంపు, సులభతర వ్యాపార నిర్వహణ, దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని'' అమిత్ షా అన్నారు.
Also Read : ఇజ్రాయెల్, సిరియా మధ్య కాల్పుల విరమణ
amit shah | telugu-news | rtv-news