/rtv/media/media_files/2025/05/11/gnbARLW96L2Wk5X5TEDZ.jpg)
PL 15 Missile
భారత్‌లో దాడులు చేసేందుకు చైనాకు చెందిన పీఎల్ 15 దీర్ఘశ్రేణి క్షిపణిని ఉపయోగించామని పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ చెప్పిన సంగతి తెలిసిందే. గగనతలంలో లక్ష్యాలు ఛేదించే ఈ అస్త్రాన్ని యుద్ధంలో వాడటం ఇదే మొదటిసారి. అయితే ఈ పీఎల్ 15 క్షిపణి శకలాలు పంజాబ్‌లోని హోశియాపుర్ దగ్గర్లో పడ్డాయి. ఒక అస్త్రం చెక్కుచెదరకుండా దొరికింది. భారత భద్రతా దళలు దీన్ని స్వాధీనం చేసుకున్నాయి. అయితే ఇప్పుడు ఆ అస్త్రాన్ని విడిగొట్టి.. అందులో వాడిన సాంకేతిక గుట్టును భారత్ తెలుసుకోనుంది.
Also Read: పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకున్నాం: రాజ్‌నాథ్ సింగ్
పీఎల్ 15 క్షిపణి
పీఎల్ 15 అనేది గగనతలం నుంచి గగనతలంలోకి దాడులు చేయగల రాడార్ గైడెడ్ మిసైల్. దీన్ని చైనాలోని ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ (కాసిక్) ఉత్పత్తి చేస్తోంది. స్వీయ అవసరాల కోసం దీన్ని అభివృద్ధి చేసుకున్న వేరియంట్‌కు 200-300 కిలోమీటర్ల రేంజ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అయితే పాకిస్థాన్‌కు సరఫరా చేసినటువంటి విదేశీ వేరియంట్ అయిన పీఎల్ 15ఈకి గరిష్ఠంగా 145 కిలోమీటర్ల పరిధి ఉండొచ్చు.
Also Read : సైన్యంలో చేరి నా తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటా : జవాన్ కూతురు
అయితే ఈ క్షిపణిలో యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ అర్రే (AESA) రాడార్ సీకర్ ఉంది. అందుకే ప్రత్యర్థి ప్రయోగించే ఎలక్ట్రానిక్ యుద్ధతంత్రాలను చాలావరకు తట్టుకొని నిలబడగలదు. టువే డేటా సాయంతో మార్గమధ్యంలోనే సమాచారాన్ని తీసుకోగలదు. అలాగే దీనికి 2025 కిలోల హై ఎక్స్‌ప్లోజివ్ ఫ్రాగ్మెంటేషన్ వార్‌హెడ్ కూడా ఉంది. గగనతలంలో చురుగ్గా విన్యాసాలు చేస్తూ టార్గెట్‌లను నాశనం చేసేలా దీన్ని తయారుచేశారు.
Also Read: ఆపరేషన్ సింధూర్ సీక్రెట్ బయటపెట్టిన UP సీఎం యోగి
అయితే ఈ మిసైల్‌ను జేఎఫ్ 17 బ్లాక్ 3, జే10సి, జే20 వంటి యుద్ధవిమానాల నుంచి ప్రయోగించవచ్చు. గగనతల ముందస్తు హెచ్చరిక, నియంత్రణల వ్యవస్థ (అవాక్స్), ట్యాంకర్ విమానాలు, యుద్ధవిమానాలు వంటి విలువైన టార్గె్ట్‌లు ధ్వంసం చేసేందుకు దీన్ని వాడొచ్చు. అయితే చెక్కుచెదరని స్థితిలో పీఎల్ 15 క్షిపణి దొరకడం భారత్‌కు ఓ వరమని నిపుణులు అంటున్నారు. ఈ మిసైల్ సీకర్, చోదక, డేటాలింక్, ఎలక్ట్రానిక్ కౌంటర్ కౌంటర్ మెజర్స్ వ్యవస్థలను విశ్లేషించవచ్చని చెబుతున్నారు. దీంతో భారత్ మరింత మెరుగైన స్వదేశీ క్షిపణులు అభివృద్ధి చేసుకోవచ్చని అంటున్నారు.
Also Read : 9,970 పోస్టులకు ఇవాళే లాస్ట్ డేట్.. త్వరగా అప్లై చేసేయండి
india pakistan war | india pakistan war 2025 | telugu-news | rtv-news