Rajnath Singh: పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకున్నాం: రాజ్‌నాథ్‌ సింగ్

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ కీలక ప్రకటన చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామన్నారు. ఆపరేషన్ సింధూర్‌ ద్వారా ఉగ్రవాదులకు గట్టి జవాబిచ్చామని పేర్కొన్నారు. బ్రహ్మోస్‌ క్షిపణితో శత్రువుకు మన శక్తి ఏంటో తెలియజేశామన్నారు.

New Update
Rajanth Singh

Rajanth Singh

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ కీలక ప్రకటన చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామన్నారు. ఆపరేషన్ సింధూర్‌ ద్వారా ఉగ్రవాదులకు గట్టి జవాబిచ్చామని పేర్కొన్నారు. కేవలం పాక్ సరిహద్దు మాత్రమే కాదు.. రావల్పిండిపైనా కూడా దాడి చేశామని తెలిపారు. బ్రహ్మోస్‌ క్షిపణితో శత్రువుకు మన శక్తి ఏంటో తెలియజేశామని స్పష్టం చేశారు. 

Also Read: కాల్పుల విరమణ తర్వాత మోదీ ఫస్ట్ ట్వీట్.. ఏమన్నారంటే?

మరోవైపు యుద్ధంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా సంచలన ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆపలేదని ఎక్స్ లో తెలిపింది. త్రివిధ దళాలతో ప్రధాని మోదీ భేటీ అనంతరం.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ ప్రకటన చేసింది. ఇప్పటికే పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. శనివారం కాల్పుల విరమణకు ఇరుదేశాలు అంగకరీంచినప్పటికీ కూడా పాక్‌ తన మళ్లీ తన దొంగబుద్ధి చూపించింది.  

మే 12న సోమవారం భారత్‌-పాకిస్థాన్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. హాట్‌లైన్‌లో జరగబోయే ఈ చర్చలకు ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్‌(DGMO)లు పాల్గొననున్నారు. కాల్పుల విరమణకు అంగీకరించిన తర్వాత సోమవారం ఇరుదేశాల మధ్య జరగబోయే చర్చలు కీలకంగా మారనున్నాయి. ఈ సమావేశంలో కాల్పుల విరమణ కొనసాగింపు, ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించడం లాంటి అంశాల గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

Also Read: మీడియా ముందు బయటపడ్డ దొంగ పాక్.. పుల్వామా అటాక్‌ కూడా మేమే

శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు భారత్‌ DGMOతో పాకిస్థాన్ డీజీఎంవో హాట్‌లైన్‌లో మాట్లాడారు. కాల్పుల విరమణను అమలు చేద్దామని కోరారు. ఆ తర్వాత భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాతో మాట్లాడారు. సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని చెప్పారు. కానీ శనివారం రాత్రి పాక్ దాన్ని ఉల్లంఘించి దొంగబుద్ధి చూపించింది. రేపు ఇరుదేశాల మధ్య జరగబోయే చర్చలపై ఆసక్తి నెలకొంది.  

telugu-news | national-news | india pakistan war | 2025 india pakistan war | rajnath-singh

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు