soldier Daughter : సైన్యంలో చేరి నా తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటా : జవాన్ కూతురు

పాకిస్థాన్ చేసిన డ్రోన్ దాడిలో రాజస్థాన్ కు చెందిన సార్జెంట్ సురేంద్ర మోగా వీరమరణం పొందిన సంగతి తెలిసిందే.  ఈ సందర్భంగా ఆయన కూతురు వర్తిక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

New Update
solider daughter

solider daughter

పాకిస్థాన్ చేసిన డ్రోన్ దాడిలో రాజస్థాన్ కు చెందిన సార్జెంట్ సురేంద్ర మోగా వీరమరణం పొందిన సంగతి తెలిసిందే.  ఈ సందర్భంగా ఆయన కూతురు వర్తిక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నా తండ్రి దేశాన్ని కాపాడుతూ అమరుడైనందుకు గర్వపడుతున్నానని బాలిక తెలిపింది. పాకిస్థాన్ పూర్తిగా నాశనం కావాలని.. తాను కూడా సైన్యంలో చేరి నా తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని బాలిక శపథం చేసింది. శత్రువులను ఒక్కొక్కరిగా అంతం చేస్తానంటూ ప్రతిజ్ఞ చేసింది. 

Also Read :  హైదరాబాద్‌లో క‌రాచీ బేక‌రి ధ్వంసం.. పేరు మారుస్తారా? బోర్డు తీస్తారా? - వీడియో!

Also Read :  ఈ రాత్రికి ఒక్క డ్రోన్ వచ్చినా.. రేపటికి పాక్ ఉండదు.. భారత్ సీరియస్ వార్నింగ్!

విధి నిర్వహణలో ఉన్నప్పుడు

కాగా రాజస్థాన్‌లోని ఝుంఝును నివాసి అయిన సురేంద్ర మోగా, భారత వైమానిక దళంలో మెడికల్ అసిస్టెంట్ సార్జెంట్‌గా పనిచేస్తున్నాడు.  శనివారం పాకిస్తాన్ డ్రోన్ దాడికి గురైన ఉధంపూర్ వైమానిక స్థావరంలో విధి నిర్వహణలో ఉన్నప్పుడు  సురేంద్ర సింగ్ మోగా ప్రాణాలు కోల్పోయాడు. సురీందర్ కుమార్ మోగా కుటుంబంలో అతని తల్లి, భార్య, 11 ఏళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు.

ఝుంఝును జిల్లాలోని మాండవాలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అమరవీరుడు సురేంద్ర కుమార్ అంత్యక్రియలు జరిగాయి. జిల్లా ఇన్‌చార్జి మంత్రి అవినాష్ గెహ్లాట్, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ ప్రేమ్‌చంద్ బైర్వా, సైనిక సంక్షేమ శాఖ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్, రాజ్యసభ ఎంపీ మదన్ రాథోడ్, ప్రతిపక్ష నేత టికారమ్ జూలీ, లక్ష్మణ్‌గఢ్ ఎమ్మెల్యే గోవింద్ దోటసార, ఝుంజును ఎంపీ బ్రిజేంద్ర ఓలా, మండవా ఎమ్మెల్యే రీటా చౌడ్రాప్ చైర్మన్, చోదర్ ఛౌడ్రాప్ చైర్మన్. ప్రధాన్ దినేష్ సుంద కూడా అంత్యక్రియలకు హాజరయ్యారు.

Also Read :  ట్రై సిరీస్ ఫైనల్ .. శ్రీలంక ఫట్.. ఇండియా సూపర్ విక్టరీ!

Also Read :  ''ఆ విషయాలు చెప్పాల్సిందే''.. ప్రధానికి రాహుల్ గాంధీ సంచలన లేఖ..

telugu-news | soldier

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు