IND- PAK War: అణు బాంబు పడినా ప్రాణాలు కాపాడుకోవచ్చు.. ఇలా చేస్తే చాలు..!

భారత్, పాక్ లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణమైన బాంబుల వర్షం కురిసే ఛాన్స్ ఉంది. దీంతో ప్రజలను అప్రమత్తం చేస్తూ, అనుబాంబు పడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పోలీసులు కీలక సూచనలు చేశారు. అవేంటో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ చదవండి.

New Update
ind pak war

India Pak WAR Tension Defense Mock Drills

IND- PAK War: భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. రెండు దేశాలు యుద్ధం అంచున ఉన్నాయి. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సిద్ధమైంది. మరోవైపు పాకిస్తాన్ కూడా అణ్వాయుధ దాడి చేస్తామని బెదిరిస్తోంది. ఇందులో భాగంగానే మే 7న భారతదేశం అన్ని రాష్ట్రాల్లో యుద్ధ భద్రతా మాక్ డ్రిల్‌లను ఆదేశించింది. దేశవ్యాప్తంగా యుద్ధ సైరన్లు మోగనున్నాయి. యుద్ధం జరిగినప్పుడు దాని ప్రజలను రక్షించడం దీని ఉద్దేశ్యం. కాగా ఈ మాక్ డ్రిల్ జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, హర్యానాతో సహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నిర్వహించబడుతుంది. ఇందులో దాదాపు 244 జిల్లాలు ఉన్నాయి. ఈ సన్నాహాలను బట్టి చూస్తే ఏదో పెద్ద సంఘటన జరగబోతోందనిపిస్తోంది. యుద్ధం జరిగితే అణు దాడులు కూడా జరుగుతాయా అనే ప్రశ్న ప్రజల మనసుల్లో మెదులుతోంది. ఒకవేళ అణు దాడి జరిగితే అటువంటి పరిస్థితిలో ఏం చేయాలో తెలుసుకుందాం. 

కిటికీలు, డోర్లు, గోడలకు దూరంగా..

అణుబాంబ్ పడినా మరణం నుంచి కూడా తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎక్కడైనా అణు బాంబు పడుతుందని మీకు హెచ్చరిక వస్తే వెంటనే సమన్వయంతో వ్యవహరించాలి. మీరు తొందరపడి బయటకు వెళ్ళకూడదు. అలాంటి పరిస్థితిలో మీరు వెంటనే బలమైన భవనం లోపలికి వెళ్లాలి లేదా బంకర్‌లో ఆశ్రయం పొందాలి. కాంక్రీట్ గోడలు, బంకర్లు రేడియోధార్మిక కిరణాల నుండి రక్షిస్తాయి. ఒక అణు బాంబు పడినప్పుడు ఇంట్లో ఉంటే కిటికీలు, డోర్లు, గోడలకు దూరంగా ఉండాలి. ఆ పేలుడు చాలా శక్తివంతమైనది. కావున కిటికీలు, తలుపుల, అద్దాలను పగలగొట్టగలదు. దీని వలన మీకు హాని జరగవచ్చు. అణు బాంబు పడినప్పుడు మీరు ఇంటి బయట ఉంటే వెంటనే నేలపై పడుకుని మీ తలను రెండు చేతులతో కప్పుకోండి.

Also Read: ఛీ ఛీ.. అక్కవేనా నువ్వు..? సొంత చెల్లెళ్లని లవర్‌తో రేప్ చేయిస్తావా..!

* అణు దాడి జరిగితే బలమైన భవనం లేదా కాంక్రీట్ గోడలు ఉన్న ఇంట్లో దాచుకోవాలి. 
* పేలుడు కారణంగా కిటికీలు, తలుపులు, అద్దాలకు దూరంగా ఉండండి. అవి పగిలిపోయే అవకాశం ఉంది. 
* మీరు ఇంటి బయట ఉంటే నేలపై పడుకుని, ముఖం క్రిందికి వంచి, మీ తలను మీ చేతులతో కప్పుకోండి.
* అణు బాంబు పేలిన తర్వాత 48 గంటల పాటు ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దు.
* రేడియోధార్మిక ధూళి లోపలికి రాకుండా నిరోధించడానికి కిటికీలు, తలుపులను టేప్ లేదా బట్టలతో మూసివేయండి.
* దుమ్ము, ధూళి పీల్చకుండా ఉండటానికి మీ నోరు, ముక్కును మాస్క్ లేదా వస్త్రంతో కప్పుకోండి.
* ఇంట్లో విద్యుత్తు వాడకూడదు.
* ఇంట్లో హెల్త్ కిట్, నీరు, ఆహారం అందుబాటులో ఉంచుకోండి.

Also Read: హైదరాబాద్ లేడీసా మజాకా.. బ్లౌజ్ ఆఫర్ చూడగానే పరుగో పరుగు - కిక్కిరిసిపోయిన షాప్

pakistan | bomb | telugu-news | today telugu news

Advertisment
Advertisment
తాజా కథనాలు