పహల్గామ్ ఉగ్రదాడిని అత్యంత సీరియస్ గా తీసుకున్న మోదీ సర్కార్ ఉగ్రవాదులను, వారిని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పై సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ తో ఆ దేశంలోని అనేక ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. అంతటితో ఆగకుండా.. ఆ దేశంలోని కీలక సైనిక స్థావరాలపై దాడులు చేసి మన సైన్యం సత్తాను శత్రుదేశానికి తెలిసేలా చేసింది. భారత్ పై జరిగే ఏ ఉగ్రదాడి అయినా యుద్ధంగానే పరిగణిస్తామని స్పష్టం చేసింది. తద్వారా భారత్ వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడేలా ఉగ్రమూకలకు వార్నింగ్ ఇచ్చింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రబుద్ధిని ప్రపంచానికి చాటి చెప్పడానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. అఖిలపక్ష పార్టీల ప్రతినిధి బృందాన్ని వివిధ దేశాలకు పంపించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఉగ్రవాదానికి పాకిస్తాన్ పుట్టినిళ్లు అన్న విషయాన్ని ఆయా దేశాలకు ఈ అఖిలపక్ష బృందం వివరించనుంది. ఆ దేశం ఉగ్రవాదులకు ఎలా సహాయం చేస్తోంది? వారిని భారత్ తో పాటు ఇతర దేశాలకు ఎలా పంపించి దాడులు చేయిస్తోంది? అన్న వివరాలను చాటి చెప్పనుంది.
Also Read : Alekhya Chitti Pickles: అలేక్య చిట్టి పికిల్స్ సిస్టర్ నటిస్తున్న సినిమా ఇదే.. వీడియోలు చూశారా?
ఈ బృందం యొక్క ఐదు ప్రధాన అజెండాలు..
మొదటిది: ఆపరేషన్ సిందూర్‌కు దారితీసిన పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యల గురించి వివరించడం..
రెండవది: ఆపరేషన్ సిందూర్ సాధించిన విజయాలను చాటి చెప్పడం..
మూడవది: ఇటువంటి ఉగ్రవాద సంఘటనలు ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో కూడా ఇంతకన్నా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని తెలియజేయడం..
నాల్గవది: ఆపరేషన్ సిందూర్ సమయంలో ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని నొక్కి చెప్పడం..
ఐదవది: ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో పాకిస్తాన్ పాత్రను.. తద్వారా ప్రపంచానికి సవాలుగా మారనున్న పరిణామాలను హైలైట్ చేయడం..
Also Read : IND-PAK WAR: పాక్ పరువు తీసేలా.. మోదీ మరో మాస్టర్ ప్లాన్.. దూసుకెళ్లనున్న 'ఓవైసీ బాంబ్'?
ఈ బృందం ఏమి చేస్తుంది?
భారత ప్రతినిధి బృందం విదేశీ ప్రభుత్వాలు, ఆయా దేశాల మీడియా సంస్థలు, ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ సంస్థలతో చర్చలు జరుపుతాయి. పాక్ ఉగ్రవాద విధానాలను వివరిస్తాయి. ఈ ప్రతినిధి బృందం మే 22న బయలుదేరి, జూన్ 4 నాటికి తిరిగి వచ్చేలా కేంద్ర విదేశాంగ శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.
Also Read : నవంబర్‌లో కుప్పకూలనున్న మోదీ సర్కార్.. ?
ఓవైసీ, శశీ థరూర్ నేతృత్వం?
విదేశాలకు మొత్తం పది బృందాలను పంపించాలని మోదీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రతీ బృందంలో ఐదుగురు ఎంపీలు, విదేశాంగ మంత్రిత్వ అధికారులు కలిపి మొత్తం పది మంది ఉండే అవకాశం ఉంది. ఈ పది బృందాలకు కాంగ్రెస్ ఎంపీ శశీ థరూర్ ను హెడ్ గా నియమించనున్నట్లు తెలుస్తోంది. ఓ బృందానికి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. పహల్గామ్ ఘటన చోటు చేసుకున్న నాటి నుంచి ఓవైసీ పాకిస్తాన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఆ దేశాన్ని నాశనం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్ తీరు ఇస్లాంకు వ్యతిరేకం అంటూ ధ్వజమెత్తుతున్నారు. కాంగ్రెస్ ఎంపీ శశీథరూర్ కూడా మోదీ సర్కార్ చర్యలను ప్రశంసిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరిని ఎంపిక చేసినట్లు ప్రచారం సాగుతోంది.
Also Read : ఢిల్లీ క్యాపిటల్స్‌కు రూ. 11 కోట్ల ఆటగాడు దూరం.. కట్ చేస్తే రూ.3 కోట్లు!
పీపీ ప్రధానిగా ఉన్న సమయంలోనూ..
గతంలో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలోనూ అటల్ బిహారీ వాజ్‌పేయిని UNHRCకి పంపారు. 26/11 ముంబై దాడుల తర్వాత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా అంతర్జాతీయ సమాజంతో మాట్లాడారు.
(india operation sindoor | IND-PAK War | telugu-news | telugu breaking news)