ICICI Bank Minimum Balance: ఖాతాదారులకు ICICI షాక్.. ఇకపై రూ. 50,000 ఉండాల్సిందే..!

ఐసీఐసీఐ బ్యాంక్‌ తన ఖాతాదారులకు బిగ్‌ షాక్‌ ఇచ్చింది. తన సేవింగ్స్ ఖాతాదారుల కనీస సగటు బ్యాలన్స్ నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. సవరించిన నిబంధనల ప్రకారం..అర్బన్, మెట్రో ప్రాంతాల ఖాతాదారులు తమ ఖాతాల్లో సగటున రూ.50 వేలు కనీస నిల్వ ఉంచాలి.

New Update
ICICI Bank Minimum Balance

ICICI Bank Minimum Balance

ICICI Bank Minimum Balance : ప్రైవేటు బ్యాంకింగ్‌రంగంలో అగ్రగామిగా ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్‌ తన ఖాతాదారులకు బిగ్‌ షాక్‌ ఇచ్చింది. తన సేవింగ్స్ ఖాతాదారుల కనీస సగటు బ్యాలన్స్  నిబంధనల్లో భారీ మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. నిజానికి ఈ నిబంధన ఆగస్టు 1 నుంచే అమల్లోకి వచ్చింది. ఈ మార్పు మెట్రో, అర్బన్, సెమీ-అర్బన్, గ్రామీణ బ్రాంచ్‌ల ఖాతాదారులందరిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ పెంపు మూలంగా దేశీయ బ్యాంకులలో అత్యధిక ‘కనీస సగటు బ్యాలన్స్’ ఉన్న బ్యాంకుల్లో ఐసీఐసీఐ బ్యాంక్‌దే అగ్రస్థానం అవుతోంది.

ఇది కూడా చూడండి:KTR vs Bandi Sanjay :  బండి సంజయ్‌కి 48 గంటల డెడ్‌లైన్‌.. సారీ చెప్పకపోతే అంతే...కేటీఆర్ వార్నింగ్

ఐసీఐసీఐ బ్యాంక్‌ ఇటీవల నూతనంగా సవరించిన నిబంధనల ప్రకారం.. అర్బన్, మెట్రో, ప్రాంతాల ఖాతాదారులు తమ ఖాతాల్లో సగటున రూ.50 వేలు కనీస నిల్వ ఉంచాలి. గతంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ ఖాతాల్లో రూ.10వేల వరకు కనీస బ్యాలన్స్‌ అవకాశం ఉండేది. దీన్ని ఇపుడు రూ.10,000 నుంచి రూ.50,000 కు పెంచడంతో.. కనీస బ్యాలన్స్‌ ఐదు రెట్లు పెరిగినట్లయింది. ఇక సెమీ-అర్బన్ బ్రాంచ్‌లలో కనీస బ్యాలెన్స్ రూ.5,000 నుంచి రూ.25,000కు పెంచింది. అలాగే గ్రామీణ బ్రాంచ్‌లలోనూ రూ.2,500 లుగా ఉన్న కనీస బ్యాలన్స్‌ ను రూ. 10,000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Also read: ధర్మస్థల కేసులో కీలక పరిణామం.. తవ్వకాల్లో దొరకని అస్తికలు.. ఎంత తవ్వుతున్న మట్టే!

అయితే, దేశంలోనే అతిపెద్ద బ్యాంకుగా ఉన్న  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)  మాత్రం 2020లోనే మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను పూర్తిగా రద్దు చేసింది. అదే సమయంలో ఇతర బ్యాంకులు సాధారణంగా రూ.2,000 నుంచి రూ.10,000 వరకు మాత్రమే మినిమం బ్యాలెన్స్ ఉంచేలా  నిబంధనలు అమలు చేస్తుంటాయి. ఇక ఇటీవల HDFC లిమిటెడ్‌తో విలీనం తరువాత ఆస్తుల పరంగా అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు మారిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మినిమం బ్యాలెన్స్‌ను మెట్రో, అర్బన్‌లో రూ.10,000, సెమీ-అర్బన్‌లో రూ.5,000, గ్రామీణ బ్రాంచ్‌లలో రూ. 2,500గా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు తమ రోజువారీ కార్యకలాపాలు, పెట్టుబడుల ఖర్చులను తీర్చుకునేందుకు మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలను అమలు చేస్తుంటాయి. ఈ పరిమితి కంటే తక్కువ నిల్వ ఉంచిన ఖాతాదారులపై జరిమానాలు కూడా వేస్తుంటాయి. ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధన అమలులోకి తీసుకు వచ్చిన నేపథ్యంలో సవరించిన ఫీజు చార్ట్ ప్రకారం జరిమానాలు విధించే అవకాశం ఉంది.

Also Read: ట్రంప్‌కు భారత్ బిగ్ షాక్.. బెదిరింపులకు భయపడదే లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్

Advertisment
తాజా కథనాలు