Wanaparthy : అదృష్టం అంటే నీదే బ్రో.. 101 వంటలతో విందు..ఒక్కటి తగ్గింది.. తులం బంగారం దక్కింది
తెలంగాణలో ఈ దసరా పండగకు విందు భోజనంతో పాటు తులం బంగారం కూడా దక్కించుకున్నాడు ఓ అల్లుడు. విస్తరిలో 101 వంటకాలతో విందు ఏర్పాటు చేయగా అల్లుడు చేసిన చాలెంజ్లో అత్తామామలు ఓడిపోవడంతో.. అతడికి తులం బంగారం గెల్చుకునే అవకాశం లభించింది.