/rtv/media/media_files/2025/04/18/tuCiS78qw5c4WhgxA4l2.jpg)
ఆంధ్ర ప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని శుక్రవారం సిట్ అధికారులు మూడు గంటల పాటు విచారించారు. సిట్ అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. వాటికి ఆయన చెప్పిన సమాధానాలు బయటకు వచ్చాక మీడియాకు వివరించారు. లిక్కర్ స్కామ్‌కు పాల్పడిన వారి పేర్లను విజయసాయి రెడ్డి బయటపెట్టారు. 2019 చివర మీ ఇంట్లో మీటింగ్ జరిగిందా అని ఆయన్ని అధికారులు ప్రశ్నించారు. హైదరాబాద్, విజయవాడలోని నా ఇళ్లలోనే 2 సమావేశాలు జరిగాయని విజయసాయి రెడ్డి చెప్పారు. ఆ సమావేశాలకు వాసుదేవరెడ్డి, శ్రీధర్ రెడ్డి, మిథున్ రెడ్డి, సత్యప్రసాద్, కసిరెడ్డి వచ్చారని తెలిసింది. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డి హాజరుకాలేదని విజయసాయి రెడ్డి చెప్పారు.
Also read; GST on UPI: ఫోన్ పే, గూగుల్ పే యూజర్లుకు భారీ షాక్..!
ఎవరెవరంటే?
కసిరెడ్డి కో బ్రదర్ అవినాష్ రెడ్డి, అతని అనుచరుడు చాణక్య, కసిరెడ్డి అనుచరుడు కిరణ్, సుమిత్, సైఫ్ సహా అనేక మంది నెట్‌వర్క్‌లో ఉన్నారని సిట్ అధికారులకు తెలిపారు. రాజ్ కసిరెడ్డి నుంచి ఎవరికి ముడుపులు వెళ్లాయని అడిగారు. ముడుపుల విషయం విజయసాయి రెడ్డిని తెలియదని ఆయన చెప్పారు. ఒకరికి రూ.60 కోట్లు, మరొకరికి రూ.40 కోట్లు ఇచ్చారని చెప్పారు. రుణం మాత్రమే ఇప్పించాను. నిధుల వినియోగం గురించి తెలియదని ఆయన అన్నారు. లిక్కర్ స్కామ్‌లో బిగ్ బాస్ ఎవరో కసిరెడ్డి చెప్పాలని విజయసాయి రెడ్డి అన్నారు. మిథున్ రెడ్డి పాత్ర గురించి తనకు తెలియదని.. అది ఆయన్నే అడగాలని మాజీ రాజ్య సభ సభ్యుడు విజయసాయి రెడ్డి చెప్పారు. సిట్ అధికారు మరో సారి విచారణ కు పిలిచినా వస్తానని ఆయన స్పష్టం చేశారు.
Also read: Rahul Gandhi: రోహిత్ వేముల పేరుతో చట్టం.. CMకు రాహుల్ గాంధీ లేఖ
(vijayasai reddy | ap liquor scam | investigation | sit | andhra-padesh | latest-telugu-news)