Bihar Elections 2025: మోదీకి చిరాకు తెప్పిస్తున్న చిరాగ్..కూటమి పని ఖతమేనా?

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు మొదటి దశ నోటిఫికేషన్ జారీ అయింది. అభ్యర్థుల జాబితాను ఖరారు చేయడానికి అన్ని పార్టీలు సిద్దమవుతున్నాయి. ఈ క్రమంలో  NDA కూటమిలో సీట్ల పంపకం చర్చలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

New Update
chirag

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు(Bihar Elections 2025) మొదటి దశ నోటిఫికేషన్ జారీ అయింది. అభ్యర్థుల జాబితాను ఖరారు చేయడానికి అన్ని పార్టీలు సిద్దమవుతున్నాయి. ఈ క్రమంలో  NDA కూటమిలో సీట్ల పంపకం చర్చలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) (LJP-RV) అధ్యక్షుడు, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్(chirag-paswan) తమ పార్టీకి 40 సీట్లు కేటాయించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.అయితే బీజేపీ మాత్రం కేవలం 22 సీట్లు మాత్రమే ఇచ్చే్ందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

Also Read :  'షాక్ అయిపోయా'.. షూ దాడిపై తొలిసారిగా స్పందించిన సీజేఐ బీఆర్‌ గవాయ్

పట్టుబడుతున్న చిరాగ్

2024 లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ వంద శాతం విజయాలు సాధించిన నేపథ్యంలో, అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మెరుగైన స్థానాలు ఇవ్వాలని చిరాగ్ పాశ్వాన్ పట్టుబడుతున్నారు.  బీజేపీ, జేడీయూలతో పాటు ఎన్డీయే కూటమిలోని ఇతర చిన్న మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకం ఫార్ములాపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. చిరాగ్ పాశ్వాన్ డిమాండ్‌కు, బీజేపీ ఆఫర్‌కు మధ్య పెద్ద తేడా ఉండటంతో ఈ చర్చలు ఉత్కంఠగా మారాయి. ముఖ్యంగా జేడీయూ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న వైశాలిలోని మన్‌హర్, బెగుసరాయ్‌లోని మతిహాని, జముయ్‌లోని చకై వంటి సీట్లలో పోటీ చేయాలని చిరాగ్ పాశ్వాన్ కోరుతున్నట్లు తెలుస్తోంది. 

చిరాగ్ పాశ్వాన్ ఢిల్లీ బయలుదేరే ముందు, కేంద్ర పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని, పార్టీ ఎన్నికల వ్యూహాలపై సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. తమ డిమాండ్లు నెరవేరకపోతే కూటమి నుంచి వైదొలిగే అవకాశం కూడా ఉందని చిరాగ్ పాశ్వాన్ సంకేతాలు ఇచ్చారు. గురువారం పాట్నాలోని తమ పార్టీ కార్యాలయంలో జరిగే సమావేశంలో పార్టీ ఎన్నికల వ్యూహాన్ని నిర్ణయిస్తామని లోక్ జనశక్తి పార్టీ (ఆర్‌వి) ఎంపీ అరుణ్ భారతి ఈ విలేకరితో అన్నారు.  సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతుండగానే, హెచ్‌ఏఎం (HAM) నాయకుడు బీకే సింగ్ సమస్తిపూర్ జిల్లాలోని మోర్వా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అక్టోబర్ 13న నామినేషన్ వేస్తానని ప్రకటించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు సంతోష్ మాంఝీ మద్దతు తనకు ఉందని ఆయన పేర్కొన్నారు. 

మరోవైపు, ప్రతిపక్ష ఇండియా కూటమిలో ముఖ్య భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల ఎంపికలో వేగం పెంచింది. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు 25 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయ బలంగా ఉన్న నియోజకవర్గాలుగా పరిగణిస్తున్నారు.

Also Read : Rinku Singh : రూ. కోట్లు ఇస్తావా.. చస్తవా.. రింకు సింగ్ కు దావూద్ గ్యాంగ్ బెదిరింపులు

Advertisment
తాజా కథనాలు