/rtv/media/media_files/2025/10/09/iaf-2025-10-09-13-38-14.jpg)
IAF’s dinner menu roasts Pakistan on Air Force Day
భారత వైమానిక దళం 93వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాత్రి సైనికుల కోసం ఓ వినూత్నమైన డిన్నర్ మెనూను తీసుకొచ్చారు. ఆ మెనూలో ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత సైన్యం ధ్వంసం చేసిన పాక్ వైమానిక, ఉగ్ర స్థావారాల పేర్లతో వంటకాలు ఉన్నాయి. రావల్పిండి చికెన్ తిక్క మసాలా, రఫీకీ రార మటన్, బహవల్పూర్ నాన్, బాల్‌కోట్ తిరామిసూ, మురిద్కే మేతా పాన్ తదితర వంటకాలను మెనూలో ఉంచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం స్థానాలు గెలుచుకుంటాం: మహేశ్ కుమార్ గౌడ్
From Rawalpindi Chicken Tikka to Balakot Tiramisu: Army officer shares a menu with dishes named after terror targets hit during Operation Sindoor.#Operationsindoor#IndianArmypic.twitter.com/VTEioGalNh
— The Tatva (@thetatvaindia) October 9, 2025
Also Read: IPS ఆఫీసర్ సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్.. DGPని అరెస్ట్ చేయాలని భార్య డిమాండ్
ఇదిలాఉండగా ఈ ఏడాది ఏప్రిల్ 26న పహల్గాం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం భారత సైన్యం మే 7న ఆపరేషన్ సిందూర్ పేరుతో పీఓకే , పాక్‌లోని తొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాక్ భారత్‌పై డ్రోన్లతో దాడులకు పాల్పడగా భారత సైన్యం ఆ దాడులను తిప్పికొట్టింది. అలాగే పాక్ వైమానిక స్థావరాలపై కూడా దాడులు చేసింది.