Group 2: రేపటి నుంచే గ్రూప్-2 పరీక్షలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

టీజీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షలు రేపటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్నాయి. మొత్తం 1368 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఈ పరీక్షకు వెళ్లే అభ్యర్థులు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో తెలియాలంటే ఆలస్యం చేయకుండా ఆర్టికల్ చదివేయండి.

author-image
By Kusuma
New Update
TSPSC Group 1: గ్రూప్-1 దరఖాస్తు గడువు పెంపు

టీజీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షలు డిసెంబర్ 15, 16వ తేదీల్లో జరగనున్నాయి. మొత్తం 1368 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే హాల్‌ టికెట్‌లను విడుదల చేసింది. ఈ క్రమంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. 

ఇది కూడా చూడండి: 8 మంది ఉన్నా.. బీజేపీపై ఎమ్మెల్సీ కవిత ఉగ్రరూపం!

ఏవైనా ఇబ్బందులు తలెత్తితే..

ఈ క్రమంలోనే టీజీపీఎస్సీ జిల్లాల వారీగా హెల్ప్ లైన్ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఫోన్ నంబర్లతో ఉన్న జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అలాగే హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో ఏవైనా ఇబ్బందులు వచ్చిన లేదా సందేహాలు ఉన్నా కూడా 040-23542185 లేదా 040-23542187 నంబర్లకు సంప్రదింవచ్చు. లేదా [email protected] కు మెయిల్ చేయవచ్చని తెలిపింది. 

ఇది కూడా చూడండి: US: ట్రంప్‌ బాధ్యతలు చేపట్టకముందే రాజీనామా చేస్తా: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌!

మొత్తం నాలుగు పేపర్లు..

గ్రూప్-2 పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. డిసెంబర్ 15వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్-1 నిర్వహిస్తారు. మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్-2 నిర్వహిస్తారు. పేపర్ 3, 4 డిసెంబర్ 15వ తేదీన నిర్వహిస్తారు. 

ఇది కూడా చూడండి: BIT Coin: 24 గంటల్లో 3.82 లక్షల ప్రాఫిట్‌

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

గ్రూప్‌-2 పరీక్షలకు వెళ్లే అభ్యర్థులు బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తో పాటు ఏదైనా అధికారిక గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. హాల్‌ టికెట్‌లో ఫొటో బ్లర్ ఉంటే మూడు పాస్‌ఫొటోలు తీసుకెళ్లాలి. అది కూడా మూడు నెలల లోపల ఫొటోలు మాత్రమే తీసుకెళ్లాలి. ఎగ్జామ్ సెంటర్‌లోకి గంటన్నర ముందు అనుమతి ఇస్తారు. ఉదయం 8:30 గంటల నుంచి 9:30 లోపల వరకు మాత్రమే అనుమతి ఇస్తారు. ఆ తర్వాత వెళ్తే గేటు బయట ఉండాల్సిందే. మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు మాత్రమే అనుమతి ఇస్తారు. అలాగే అభ్యర్థులు చేతులకు గోరింటాకు, తాత్కాలికమైన టాటూలు వంటివి ఉంటే అనుమతించరు. పరీక్ష సెంటర్‌లోకి మొబైల్ ఫోన్స్, బ్లూ టూత్, పెన్ డ్రైవ్ కూడా అనుమతించరు. ముఖ్యంగా అమ్మాయిలు చైన్, గాజులు, రింగులు, బొట్టు, రబ్బరు బ్యాండ్, హ్యాండ్ బ్యాగ్, వాచ్ వంటివి అనుమతించరు. 

ఇది కూడా చూడండి: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల లిస్ట్ రెడీ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు