/rtv/media/media_files/2025/09/01/rahul-gandhi-2025-09-01-18-16-33.jpg)
Rahul Gandhi
కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల చోరీ అంశంలో ఇటీవలే అణుబాంబు పేల్చామన్నారు. త్వరలోనే హైడ్రోజన్ బాంబు కూడా పేలుస్తామని అన్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీ గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. బిహార్ రాజధాని పాట్నాలో ఓటర్ అధికార్ యాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. '' బీజేపీని రాజ్యాంగాన్ని దెబ్బతీసేందుకు అనుమతించం. అందుకోసమే ఓటర్ అధికార్ యాత్ర నిర్వహించాం. ఈ యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.
Also Read: త్వరలో వాయుసేన చేతికి మరో ఆయుధం..అమ్ముల పొదిలో తేజస్ మార్క్-1ఏ
కర్ణాటక, మహారాష్ట్రలో ఓట్ల చోరీ జరగినట్లు ఆధారాలు కూడా చూపించాం. ఓట్లు చోరీ చేయడం అంటే హక్కులను, ప్రజాస్వామ్యాన్ని, ఉపాధిని చోరీ చేయడమేనని తీవ్రంగా విమర్శలు చేశారు. త్వరలోనే ఓట్ల చోరీపై మరింత శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబు పేల్చబోతున్నామని'' రాహుల్ గాంధీ అన్నారు. అయితే ఈ యాత్ర ముగింపు సందర్భంగా ఇండియా కూటమి నేతలు పాట్నాలో గాంధీ సే అంబేద్కర్ మార్చ్ నిర్వహించగా దీన్ని పోలీసులు మార్గమధ్యలోనే అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేతలు అక్కడే ప్రసంగిస్తూ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు.
BREAKING : Rahul Gandhi announced biggest headache for the ECI and BJP
— Amock_ (@Amockx2022) September 1, 2025
"We dropped Atom Bomb with Karnataka voter list, now we will drop Hydrogen Bomb with Haryana data" 🔥🔥
Be scared Gyanesh Kumar, be very scared ☠️ pic.twitter.com/DcfvF6kRQ6
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ ఓట్ల చోరీ ద్వారా గెలిచేందుకు యత్నిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపణలు చేశారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఓడిపోతుందని వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా బిహార్‌లో అక్టోబర్ లేదా నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ ఓటరు అధికార్ యాత్ర చేపట్టారు. ఆగస్టు 17న ఈ యాత్ర ససారంలో మొదలైంది. 25 జిల్లాల్లో, 110 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1300 కిలోమీటర్ల వరకు సాగింది. రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగం, రైతు సమస్యలు, ద్రవ్యోల్బణం, పారిశ్రామికాభివృద్ధి వంటి సమస్యల గురించి ప్రశ్నిస్తూ అధికార ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
Also Read: ట్రంప్‌ను జోకర్ చేసిన పుతిన్.. మోదీ, జిన్‌పింగ్‌పై ప్రశంసలు
ఇటీవల కేంద్ర ఎన్నికల బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఓటర్ లిస్టులో దాదాపు 65 లక్షల ఓటర్లను తొలగించారని విపక్ష పార్టీలు చేసిన ఆరోపణలు దుమారం రేపాయి. మరోవైపు రాహుల్ గాంధీ కూడా ఇటీవల బెంగళూరులో ఓట్లచోరీపై సంచలన ఆరోపణలు చేశారు. మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఓట్లకు పైగా చోరీ అయ్యాయని ధ్వజమెత్తారు. బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి ఈ ఓట్ల చోరీకి పాల్పడ్డాయని విమర్శించారు. చివరికి ఈ వ్యవహారంపై చీఫ్ ఎలక్షన్ కమిషన్ జ్ఞానేష్ కుమార్ కూడా స్పందించారు. ఓట్ల చోరీ అనేది జరగలేదని తేల్చిచెప్పారు. ఈసీని అవమానించడమంటే రాజ్యాంగాన్ని అవమానించినట్లేనని పేర్కొన్నారు. గత కొన్నిరోజులుగా ఓట్ల చోరీ అంశం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.