/rtv/media/media_files/2025/09/01/tejas-mark-1a-2025-09-01-13-23-26.jpg)
Tejas Mark-1A
శత్రువులు ఎక్కడో ఉండరు.. మన పక్కనే ఉంటారన్నట్లు.. గత కొన్నేళ్లుగా మనం మన పొరుగుదేశాలతోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ముఖ్యంగా పొరుగున ఉన్న పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ వంటి దేశాలు మనదేశాన్ని తరుచూ కవ్వి్స్తున్నాయి. దీంతో మనదేశం తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. భారత త్రివిధ దళాలను శక్తివంతం చేసుకునేందుకు సంసిద్దమవుతున్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు సరికొత్త అత్యాధునిక ఆయుధాలు, టెక్నాలజీని అందించే ప్రయత్నం చేస్తున్నారు.
అందులో భాగంగా భారత వైమానిక దళం చాలాకాలంగా నిరీక్షిస్తున్న తేజస్ మార్క్-1ఏ యుద్ధవిమానాలు రెడీ అయ్యాయి. ఈ శ్రేణికి చెందిన రెండు జెట్‌లను ఈ నెలాఖరులోగా వాయుసేనకు అందించడానికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) సిద్ధమైనట్లు రక్షణ శాఖ కార్యదర్శి ఆర్.కె.సింగ్ తెలిపారు. వాటి పనితీరును పరిశీలించి అదనంగా 97 తేజస్ జెట్‌ల సేకరణకు ఆ సంస్థతో మరో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని తెలిపారు. గత కాంట్రాక్టు కింద తేజస్ మార్క్-1ఏ జెట్‌ల సరఫరా విషయంలో జరుగుతున్న ఆలస్యంపై భారత వాయుసేన ఇప్పటికే ఆందోళన వ్యక్తంచేసింది. నిజానికి రూ.48వేల కోట్ల విలువైన ఈ ఒప్పందం 2021 ఫిబ్రవరిలోనే కుదిరింది. కానీ ఈ యుద్ధవిమానాలకు అవసరమైన ఇంజిన్లను సరఫరా చేయడంలో అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ జాప్యం చేయడంతో వీటి తయారీ ఆలస్యం అవుతోంది.
Also Read : అద్దెకు అమ్మమ్మ తాతయ్యలు.. డబ్బు కొట్టు రిలేషన్ పట్టు
Tejas Mark-1A In Ammul's Arsenal
ఇదిలా ఉండగానే గతవారం రూ.67వేల కోట్లతో అదనంగా 97 తేజస్ మార్క్-1ఏ యుద్ధవిమానాల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అయితే పూర్తిస్థాయి ఆయుధాలతో ఈ శ్రేణికి చెందిన రెండు తేజస్‌లను అందించాకే కొత్త కాంట్రాక్టును ఖరారు చేస్తామని హెచ్‌ఏఎల్‌కు స్పష్టంచేసినట్లు ఆర్.కె.సింగ్ తెలిపారు. రాడార్, భారత ఆయుధాలను అనుసంధానించడం ద్వారా ఈ యుద్ధవిమానాలను హెచ్‌ఏఎల్(HAL) మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. తద్వారా అది సుఖోయ్-30ఎంకేఐ తరహాలో వాయుసేనకు ప్రధాన అస్త్రంగా మారునుందని పేర్కొన్నారు. తేజస్‌లను సైన్యంలో చేర్చిన తర్వాత కూడా వైమానిక దళంలో యుద్ధవిమానాల కొరత ఉంటుందని, దాన్ని పూడ్చడానికి ఇతర అవకాశాలపై దృష్టి సారిస్తామని తెలిపారు. పాతబడిపోయిన మిగ్-21ల స్థానంలో తేజస్ మార్క్-1ఏలను చేరుస్తున్నారు. భారత వాయుసేన వద్ద ఇప్పటికే 38 తేజస్ మార్క్-1 యుద్ధవిమానాలు ఉన్నాయి.
అయితే భారత్ ఇతర దేశాల నుంచి ఆయుధాలు, ఇతర యుద్ధ సామగ్రిని దిగుమతి చేసుకుంటూనే.. స్వదేశీ టెక్నాలజీని కూడా వేగంగా అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల పాకిస్తాన్‌పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో.. భారత సైన్యం బలాబలాలు, శక్తిసామర్థ్యాలను ప్రపంచ దేశాలు చూశాయి. భారత్ శక్తిని చూసి.. శత్రు దేశాలు కూడా బెంబేలెత్తిపోయాయి. ఇప్పటివరకు జరిగిన యుద్ధాల్లో మిగ్-21 విమానాలనే తట్టుకోలేకపోయిన పాకిస్తాన్ ఈ తేజస్ ఫైటర్ జెట్లు రంగంలోకి దిగితే.. తట్టుకోవడం కష్టమేనని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఎల్‌సీఏ మార్క్ 1ఏ ఒక మిగిలిన విమానాల మాదిరిగా సాధారణ యుద్ధవిమానం కాదు. ఇది అత్యాధునిక ఏవియానిక్స్, మల్టీ ఫంక్షన్ రాడార్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్‌తో దీన్ని రూపొందించారు. శత్రువుపై కచ్చితత్వంతో దాడి చేయడం ఈ తేజస్ ఫైటర్ జెట్ ప్రధాన బలం. ఈ యుద్ధ విమానంలో అమర్చిన జీఈ ఎఫ్404 ఇంజిన్ ప్రతి మిషన్‌కు వేగంగా, శక్తివంతంగా పని చేస్తుంది. ఈ తేజస్ యుద్ధ విమానం గరిష్ట వేగం సుమారుగా మాక్ 1.6 వరకు ఉంటుంది. అంటే గంటకు దాదాపు 1975 కిలోమీటర్లు ప్రయాణించే అవకాశం ఉంది. తేజస్ యుద్ధ విమానం తయారీకి ఉపయోగించే 65 శాతం విడిభాగాలు మన దేశంలోనే తయారు అవుతున్నాయి. ఇది మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలు సాధించడంలో ఒక కీలక అడుగు కానుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: దారుణం.. ఆస్తిలో వాటా ఇవ్వాలని.. 7 నెలల గర్భిణిని హత్య చేసిన కొడుకులు!