Manchu Manoj: కలిసిపోయిన మంచు విష్ణు, మనోజ్.. కొడుకుకి అవార్డు వేళ  'అన్నా' అంటూ పోస్ట్ !

'కన్నప్ప' సినిమాతో వెండితెరకు పరిచయమైన మంచు విష్ణు కుమారుడు  అవ్రామ్‌ భక్త తొలి సినిమాకే అవార్డు గెలుచుకున్నాడు. తాజాగా జరిగిన సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ లో అవ్రామ్‌ కి ఉత్తమ బాల నటుడిగా అవార్డు లభించింది.

New Update

Manchu Manoj: మంచు ఫ్యామిలీలో కొద్ది రోజులుగా వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంచు మనోజ్ తాజాగా  చేసిన ట్వీట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అయితే కన్నప్ప' సినిమాతో వెండితెరకు పరిచయమైన మంచు విష్ణు కుమారుడు  అవ్రామ్‌ భక్త ఉత్తమ బాల నటుడిగా ''సంతోషం ఫిల్మ్ అవార్డు అందుకున్నాడు''. ఈ విషయాన్ని విష్ణు తన ఎక్స్  వేదికగా పంచుకోగా.. దీనికి  మనోజ్ స్పదించారు. ''కంగ్రాట్స్‌ అవ్రామ్‌..   నిన్ను చూస్తే చాలా  గర్వంగా ఉంది! నువ్వు ఇలాగే జీవితంలో మరింత రాణించాలి నాన్న. మంచు విష్ణు అన్న, నాన్న మోహన్ బాబు గారితో కలిసి నువ్వు అవార్డు అందుకోవడం ఎంతో ప్రత్యేకం! ప్రేమతో బాబాయి అంటూ ట్వీట్ చేశారు మనోజ్. కొద్ది రోజులుగా వీరిద్దరూ మధ్య వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో మనోజ్ విష్ణు ట్వీట్ కి స్పందిస్తూ.. అన్నా అని సంబోధించడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.  దీంతో అభిమానులు.. విష్ణు- మనోజ్ మళ్ళీ కలిసిపోయారా? అని అనుకుంటున్నారు. 

Also Read: Janhvi Kapoor Photos: అబ్బా ! లెహంగాలో 'పరమ్ సుందరి' ఫోటోషూట్‌ అదిరింది.. కుర్రకారు ఫిదా!

అవార్డు పట్ల సంతోషం

అవ్రామ్‌ భక్త తన తొలి సినిమాకు అవార్డు గెలుచుకోవడంపై మంచు విష్ణు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్టేజ్ పై మాట్లాడుతూ అంతా పరమేశ్వరుడి దయ అని అన్నారు. అలాగే అవ్రామ్‌ కూడా తనకు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని, అందరికీ కృతజ్ఞతలు అని తెలిపాడు. ఇందుకు సంబంధించిన ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇది చూసిన మంచు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

శివు భక్తుడిగా మంచు విష్ణు నటన

విష్ణు హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో విడుదలైన  'కన్నప్ప' ప్రేక్షకులు, విమర్శకులను సైతం మెప్పించింది. కమర్షియల్ నిరాశపరిచినప్పటికీ కథ, నటీనటులు పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.  ఇందులో శివు భక్తుడిగా మంచు విష్ణు నటన  తన కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచింది.   కూడా  ఈ సినిమా ద్వారా మంచు విష్ణు ముగ్గురు పిల్లలు వెండితెరకు పరిచయమయ్యారు. కొడుకు  అవ్రామ్‌ భక్త మంచు విష్ణు చిన్నప్పటి రోల్  'తిన్నడు' పాత్రలో కనిపించి ఆకట్టుకోగా.. కుమార్తెలు అరియనా, వివియనా సినిమాలోని  'శ్రీకాళహస్తీ'  సాంగ్ తో అలరించారు. 

ఇదిలా మంచు మనోజ్ భైరవం సినిమతో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. బెల్లంకొండ శ్రీనివాస్, మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. 

 Read: Bezawada Bebakka: కోకాపేటలో బెజవాడ బేబక్క లగ్జరీ ఫ్లాట్.. బిగ్ బాస్ లో అంత సంపాదించిందా!

Advertisment
తాజా కథనాలు