PM Modi: క్రిమినల్స్ ఉండాల్సింది జైల్లో..పదవుల్లో కాదు..ప్రధాని మోదీ

ఏ నేత అయినా 30 రోజులు జైల్లో ఉంటే పదవుల నుంచి తొలగించాలనే బిల్లును ప్రధాని మోదీ మరోసారి సమర్థించారు. బెంగాల్ ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ పై తీవ్రంగా మండిపడ్డారు.

New Update
PM NM

PM Narendra Modi

50 గంటలు జైలు శిక్ష అనుభవించి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగాన్నే కోల్పోతుంటే..30 రోజులు జైలు శిక్ష అనుభవించిన ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి తమ స్థానాల నుంచి దిగిపోకుండా ఉండడం ఎంత వరకు సమంజసం అని ప్రధాని మోదీ అన్నారు. తప్పు చేస్తే ఎవరినైనా పదవి నుంచి తొలగించే బిల్లును వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు ఉంటే జైల్లో ఉంటారు లేదా బెయిల్ మీద ఉంటారు అంటూ విమర్శించారు. ప్రధాని మోదీ ఈరోజు వరుసగా బీహార్ బహిరంగ సభలోనూ, బెంగాల్ ర్యాలీలోనూ పాల్గొన్నారు. ఈ రెండిటిలోనూ విపక్ష నేతలను ఏకి పారేశారు. అటు ఆర్జీడీ, ఇటు తృణమూల్ కాంగ్రెస్ రెండిటినీ ఏకి పారేశారు. 

ఇకపై అలా చెల్లదు..

కొన్ని రోజుల క్రితం నేతలు జైళ్ళ నుంచి ఏకంగా పరిపాలన చేశారు..సంతకాలు పెట్టి ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చారు. ఇలా జైళ్ళ నుంచే పరిపాలన చేస్తే..దేశంలో అవినీతిని ఎలా తొలగించగలుగుతాం అని మోదీ ప్రశ్నించారు. అందుకే ఈ బిల్లును తీసుకువచ్చామని..ఇక మీదట క్రిమెనల్ నేతలకు పాలించే అవకాశం ఇవ్వమని చెప్పుకొచ్చారు. ఈ చట్టానికి ఎవరూ అతీతులు కారని...బీజేపీ నేతలైనా సరే శిక్ష అనుభవించాల్సినని మోదీ చెప్పారు. 

తృణమూల్ అభివృద్ధికి శత్రువు..

మరోవైపు బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ మీద కూడా ప్రధాని విరుచుకుపడ్డారు. ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో ఒక టీఎంసీ మంత్రి ఇప్పటికీ జైల్లో ఉన్నారని..కానీ ఆయన తన పదవిని వదులుకోవడానికి మాత్రం ఇష్టపడడం లేదని చెప్పారు. ఇలాంటి వారి కోసమే కొత్త చట్టాన్ని తీసుకొచ్చామని మరోసారి స్పష్టం చేశారు. నేర చరిత్ర ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించే ప్రతిపాదిత బిల్లుకు మద్దతు ఇస్తూ, "జైలు నుండి ఎవరూ ఆదేశాలు ఇవ్వలేరు" అని ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. మరోవైపు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ పార్టీని కూడా మోదీ తీవ్రంగా విమర్శించారు. ఈ పార్టీ అభివృద్ధికి శత్రువని అన్నారు. బీజేపీ వృద్ధిని ఆపడమే ఆ పార్టీ ఏకైక లక్ష్యమని మండిపడ్డారు. కేంద్రం నుండి రాష్ట్రానికి నిధులు తక్కువగా ఉన్నాయనే బెంగాల్ ప్రభుత్వ పదేపదే వాదనలను ప్రధాని మోదీ తిరస్కరించారు.రైల్వే ప్రాజెక్టుల మాదిరిగానే, రోడ్డు కనెక్టివిటీ కోసం యుపిఎ కంటే బెంగాల్‌కు మూడు రెట్లు ఎక్కువ డబ్బును మంజూరు చేసాము. కానీ రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టుల ముందు పెద్ద అడ్డంకి ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి మనం పంపే నిధులలో ఎక్కువ భాగం రాష్ట్రంలో దోచుకోబడుతున్నాయని చెప్పుకొచ్చారు. అంతకు ముందు ప్రధాని మోదీ..నోపారా - జై హింద్ బిమన్‌బందర్, సీల్దా - ఎస్ప్లానేడ్ , బెలెఘాటా అనే మూడు కొత్త కోల్‌కతా మెట్రో మార్గాలను ప్రారంభించారు.

Advertisment
తాజా కథనాలు