Transgender: రాహుల్‌పై సంచలన ఆరోపణలు.. ట్రాన్స్‌జెండర్‌‌పై కాంగ్రెస్ MLA అత్యాచారం!?

కేరళలోని పలక్కాడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మామ్ కూటతిల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు మహిళలు, ముఖ్యంగా మలయాళ నటి రిని జార్జ్, ట్రాన్స్‌జెండర్ కార్యకర్త అవంతిక విష్ణు, ఈయనపై సంచలన ఆరోపణలు చేశారు.

New Update
Congress MLA Rahul Mamkootathil

కేరళలోని పలక్కాడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మామ్ కూటతిల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు మహిళలు, ముఖ్యంగా మలయాళ నటి రిని జార్జ్, ట్రాన్స్‌జెండర్ కార్యకర్త అవంతిక విష్ణు, ఈయనపై సంచలన ఆరోపణలు చేశారు. దీంతో రాహుల్ మామ్ కూటతిల్ కాంగ్రెస్ యువ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే, ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవని ఆయన ఖండించారు. ఈ సంఘటన కేరళ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని సృష్టించింది.

ఈ వివాదం నటి రిని జార్జ్ ఓ ఇంటర్వ్యూతో మొదలైంది. ఆమె ఓ రాజకీయ నాయకుడిచే మూడేళ్లుగా వేధింపులకు గురవుతున్నానని చెప్పడంతో ప్రారంభమైంది. ఆమె అతని పేరు బయటపెట్టలేదు. రాహుల్ మామ్ కూటతిల్‌ తనకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతున్నాడని, ఫైవ్-స్టార్ హోటల్‌లో రూమ్ బుక్ చేసి కలవాలని అడిగినట్లు చెప్పింది. ఈ ఆరోపణల తర్వాత బీజేపీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు రాహుల్ మామ్ కూటతిల్‌ను లక్ష్యంగా చేసుకుని నిరసనలు చేపట్టాయి.

తాజాగా, ట్రాన్స్‌జెండర్ కార్యకర్త అవంతిక విష్ణు కూడా రాహుల్ మామ్ కూటతిల్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఒక ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయనతో తనకు పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత ఆయన టెలిగ్రామ్‌లో అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించారని ఆమె చెప్పారు. బెంగళూరు లేదా హైదరాబాద్‌లో కలుద్దామని అడిగాడట. ఈ విషయంపై గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆమె వాపోయారు. అయితే, ఇప్పుడు ఇతర మహిళలు ముందుకు వస్తున్నందున తాను కూడా ధైర్యం చేసి ముందుకు వచ్చానని తెలిపారు.

ఈ ఆరోపణలపై రాహుల్ మామ్ కూటతిల్ స్పందిస్తూ, రిని జార్జ్ తన ఫ్రెండ్ అని, ఆమె తన గురించి మాట్లాడలేదని అన్నారు. తనపై ఎలాంటి అధికారిక ఫిర్యాదులు లేవని, కోర్టులో తన నిర్థోషి అని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని రాహుల్ మామ్ కూటతిల్ పేర్కొన్నారు. కాగా, ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ అంతర్గత విచారణకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఈ విషయంపై విచారణ చేస్తారని తెలిపింది. ప్రతిపక్షాలు రాహుల్ మామ్ కూటతిల్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. 

Advertisment
తాజా కథనాలు