/rtv/media/media_files/2026/01/27/exam-2026-01-27-13-10-38.jpg)
యూపీలోని బస్తీ జిల్లాకు చెందిన సమృద్ధి అనే విద్యార్థిని(UP student), 2018లో తన కెరీర్‌కు ఎంతో కీలకమైన బీఎస్సీ బయోటెక్నాలజీ ప్రవేశ పరీక్ష రాసేందుకు లక్నోకు బయల్దేరింది. ఇందుకోసం ఆమె ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. షెడ్యూల్ ప్రకారం ఆ రైలు ఉదయం 11 గంటలకే లక్నో చేరుకోవాలి. కానీ, ఆ ట్రైన్ దాదాపు రెండున్నర గంటలు ఆలస్యంగా నడిచింది. మధ్యాహ్నం 12:30 గంటల కల్లా పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సిన సమృద్ధి, రైలు ఆలస్యం వల్ల సమయానికి వెళ్లలేకపోయింది. దీనివల్ల ఏడాది పొడవునా ఆమె పడ్డ కష్టం వృథా కావడమే కాకుండా, విలువైన అకాడమిక్ ఈయర్ కూడా కోల్పోయింది. ఈ అన్యాయంపై సమృద్ధి జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. తన కెరీర్ దెబ్బతినడానికి రైల్వే(indian-railway) నిర్లక్ష్యమే కారణమని, తనకు రూ.20 లక్షల పరిహారం కావాలని కోరింది.
Also Read: రౌడీ హీరో సినిమా ‘రణబాలి’ పై AI ఎఫెక్ట్.. డైరెక్టర్ ఏమన్నాడంటే..?
Huge Compensation Of Rs. 9 Lakh For UP Student
🚨 A student from Uttar Pradesh’s Basti has won Rs 9.10 lakh in compensation from the Railways after she missed a crucial entrance examination because her train arrived more than two hours late. pic.twitter.com/7mZRpuzgjw
— Indian Tech & Infra (@IndianTechGuide) January 27, 2026
సుమారు ఏడేళ్ల పాటు సాగిన ఈ కేసులో రైల్వే శాఖ తన తప్పును కప్పిపుచ్చుకోలేకపోయింది. ఎటువంటి సరైన కారణం లేకుండా రైలును ఆలస్యం చేయడం 'సేవా లోపం' కిందకే వస్తుందని కోర్టు స్పష్టం చేసింది. చివరికి, సమృద్ధికి కలిగిన మానసిక వేదనను, నష్టపోయిన కాలాన్ని గుర్తించిన కమిషన్.. రూ.9.10 లక్షల పరిహారాన్ని 45 రోజుల్లోగా చెల్లించాలని రైల్వే శాఖను ఆదేశించింది. ఒకవేళ ఆలస్యమైతే 12 శాతం వడ్డీ కూడా చెల్లించాలని హెచ్చరించింది. ఈ తీర్పు సామాన్య ప్రయాణికుల హక్కులకు దక్కిన గొప్ప విజయంగా నిలిచింది.
Also Read : రియల్ హీరోకు అవార్డు.. టూరిస్టులను కాపాడి అమరుడై
Follow Us