Himanta Biswa Sharma: చికెన్‌ నెక్‌ వివాదం.. బంగ్లాదేశ్‌కు హిమంత బిశ్వ శర్మ గట్టి కౌంటర్

అసోం సీఎం హిమాంత బిశ్వ శర్మ బంగ్లాదేశ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బంగ్లాలో కూడా రెండు సన్నని భూభాగాలు ఉన్నాయని.. అవి భారత్‌ కన్నా మరింత సున్నితమైనవని హెచ్చరించారు. యూనస్ చికెన్‌ నెక్‌ వ్యాఖ్యలపై ఆయన ఈవిధంగా కౌంటర్ ఇచ్చారు.

New Update
Himanta Biswa Sharma

Himanta Biswa Sharma

బంగ్లాదేశ్‌తో చికెన్‌ నెక్‌ కారిడార్‌ అంశం తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తాజాగా అసోం సీఎం హిమాంత బిశ్వ శర్మ బంగ్లాదేశ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బంగ్లాలో కూడా రెండు సన్నని భూభాగాలు ఉన్నాయని.. అవి భారత్‌ కన్నా మరింత సున్నితమైనవని హెచ్చరించారు. ఇటీవల బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ ముహమ్మద్ యూనస్ చికెన్ నెక్‌ గురించి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన వ్యాఖ్యలకు సీఎం హిమంత కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు దీనిపై ట్వీట్ చేశారు. 

Also Read: కరోనా పని ఖతం.. నో టెన్షన్.. గుడ్ న్యూస్ చెప్పిన నిపుణులు!

'' బంగ్లాదేశ్‌కు చెందిన మొదటి చికెన్ నెక్‌ అనేది ఉత్తర బంగ్లాదేశ్ కారిడర్, దక్షిణ దినాజ్‌పూర్‌ నుంచి దక్షిణ పశ్చిమ గారో హిల్స్‌ దాకా విస్తరించింది. ఇది మొత్తం 80 కిలోమీటర్ల వరకు పొడవు ఉంటుంది. ఈ రూట్‌లో ఎలాంటి అవాంతరం ఏర్పడ్డా కూడా రంగ్‌పూర్‌ డివిజన్ మొత్తానికి బంగ్లాదేశ్‌లో మిగతా ప్రాంతాలతో సంబంధాలు తెగిపోతాయని'' హిమంత ట్వీట్ చేశారు. దీనికి రూట్‌ చూపింటే మ్యాప్‌ను కూడా షేర్ చేశారు. 

'' చిట్టగాంగ్‌ కారిడర్‌ అనే మరో సన్నని భూభాగం ఉంది. దక్షిణ త్రిపుర నుంచి బంగాళాఖాతం దాకా 28 కి.మీ పొడవునా ఇది ఉంటుంది. భారత్‌లో ఇది చికెన్‌ నెక్‌ కంటే చిన్నదే అయినా కూడా బంగ్లాదేశ్‌ ఆర్థిక రాజధాని అయిన చిట్టగాంగ్‌ను ఢాకాతో కలిపే ఏకైక మార్గమని'' హిమంత చురకలంటించారు. 

Also Read: భారత్ ప్రధాన శత్రువు పాకిస్తాన్ కాదు.. అమెరికా నిఘా సంస్థ సంచలన రిపోర్ట్!

ఇదిలాఉండగా ఈ ఏడాది మార్చి చివర్లో ముహమ్మద్ యూనస్ చైనా పర్యటనలో ఉన్నప్పుడు భారత ఈశాన్య రాష్ట్రాలు సముద్రం మార్గం లేని రాష్ట్రాలని.. అందుకే బంగ్లాదేశ్‌ సముద్ర గార్డియన్‌గా వ్యవహరిస్తోందని అన్నారు. బంగ్లాదేశ్‌లో పెట్టుబడులు పెడితే ఈ ప్రాంతంపై పట్టు సాధించొచ్చని చైనాకు సూచనలు చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలపై అప్పట్లోనే సీఎం హిమంత బిశ్వ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత వ్యూహాత్మక చికెన్‌ నెక్‌ కారిడార్‌ను భయపెట్టేలా చూపడం మాములు విషయం కాదు. దేశంలో కొందరు ఈ మార్గాన్ని కట్ చేస్తే తూర్పు భారత్‌ వేరైపోతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఏప్రిల్ 1న ట్వీట్ చేశారు. చికెన్ నెక్‌ కారిడార్‌కు ప్రత్యామ్నాయంగా రహదారి, రైలు మార్గాలు అభివృద్ధి చేయాలని సూచనలు చేశారు. 

చికెన్ నెక్‌ అంటే ? 

చికెన్ నెక్‌ను సిలుగురి కారిడర్ అని పిలుస్తారు. ఈ సన్నని భూభాగం వెడల్పు అత్యల్పంగా 20 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉంటుంది. ఇది ఉత్తరం వైపు నేపాల్, భూటాన్.. దక్షిణంగా బంగ్లాదేశ్‌ సరిహద్దును ఆనుకుని ఉంటుంది. భారత్‌తో ఈశాన్య రాష్ట్రాలను ఈ కారిడార్‌ అనుసంధానిస్తుంది. దీని నుంచే రోడ్డు, రైలు మార్గాలు వెళ్తాయి. 

Also Read : మేడ్చల్‌లో విషాదం.. కరెంట్ వైర్ ప్రమాదంలో యువతి మృతి

Also Read :  అమెరికాలో మరోసారి కాల్పులు.. 11 మందికి పైగా..?

 telugu-news | rtv-news | india bangladesh

Advertisment
Advertisment
తాజా కథనాలు