/rtv/media/media_files/2025/02/04/Q8nwkcvlzMocgVFNPk4P.jpg)
Chat GPT and Elon mUsk
ప్రముఖ ఏఐ మోడల్ చాట్ జీపీటీపై రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి. లెఫ్ట్ భావజాలానికి ఇది అనుకూలంగా ఉంటోందని.. కన్జర్వేటివ్‌లను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తాజాగా ప్రపంచ కుబేరుడు, ఎలాన్ మస్క్ కూడా ఈ ఆరోపణలకు తన మద్దతు పలికారు. ఎక్స్‌లో చాట్ జీపీటీ కథనానికి సంబంధించిన ఓ పోస్టును రీపోస్టు చేస్తూ 'ఫార్ లెఫ్ట్' అని రాసుకొచ్చారు.
Far left https://t.co/ORtbqykaGg
— Elon Musk (@elonmusk) February 4, 2025
Also Read: మస్క్ డోజ్ లో భారత సంతతి కుర్రాడు ఆకాశ్ బొబ్బ..ఎవరో తెలుసా!
చాట్‌జీపీటీ కథనంలో ఏముంది ?
చాట్ జీపీటీ పూర్తిగా లెఫ్ట్ (వామపక్ష) భావజాలానికి అనుకూలంగా పనిచేస్తోందని ఓ పరిశోధనలో తేలిందని సైటెక్‌డెయిలీ కథనంలో రాసుకొచ్చారు. యూనివర్సిటీ ఆఫ్ ఆంగ్లియా నిర్వహించిన పరిశోధనల్లో చాట్ జీపీటీ ప్రజల విశ్వాసానికి, ప్రజాస్వామ్య విలువలకు ముప్పుగా ఉందని తేలింది. చాట్ జీపీడీ టెక్స్ట్, ఇమేజ్ జనరేషన్ రెండూ కూడా వామపక్ష భావజాలానికి అనుకూలంగా ఉన్నాయి. పాలసీ మేకింగ్, విద్య, జర్నలిజం వంటి రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో నియంత్రణ సంస్థలు సమాజికి విలువలు, ప్రజాస్వామ్య నిబంధనలు కాపాడేటట్లు చూసుకోవాల్సిన అవసరం ఉందని'' ఆ కథనంలో వచ్చింది.
Also Read: బీసీ జనాభా తగ్గలే.. పెరిగింది.. ఇదిగో ప్రూఫ్.. సభలో రేవంత్ సంచలనం!
ఇదిలా ఉండగా.. 2022 నవంబర్‌లో వచ్చిన చాట్ జీపీటీ ఏఐ రంగంలో సంచనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత గూగుల్‌కు చెందిన జెమిని, మైక్రోసాఫ్ట్‌కు చెందిన కోపైలట్, మెటాకు చెందిన లామా వంటి ఏఐ చాట్‌బోట్‌లు వచ్చాయి. అయితే తాజాగా చైనాకు చెందిన డీప్‌సీక్ ఇప్పుడు వీటన్నింటినీ వెనక్కి నెట్టేసింది. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్లలో ఒక్కరోజులోనే ఏకంగా 1 ట్రిలియన్ డాలర్లు నష్టపోయిన సంగతి తెలిసిందే.
Also Read: జాతీయ క్రీడల్లో భారీ కుంభకోణం.. బంగారు పతకాలు అమ్ముకున్న డైరెక్టర్!