/rtv/media/media_files/2025/09/26/hfmd-viral-infection-2025-09-26-15-25-59.jpg)
HFMD viral Infection
ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలోని క్లినిక్‌లు, ఆసుపత్రులలో హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ వ్యాధి (HFMD) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఢిల్లీ, గురుగ్రామ్ మరియు నోయిడాలో రోజుకు ఐదు నుంచి ఆరు కొత్త కేసులు నమోదవుతున్నాయని వైద్యులు తెలిపారు. ఈ వైరల్ ఇన్‌ఫెక్షన్ ప్రధానంగా పిల్లల్లో జ్వరం, దద్దుర్ల రూపంలో వ్యాపిస్తుంది. HFMD అనేది వేగంగా వ్యాపించే అంటువ్యాధి. ఇది సాధారణంగా కాక్సాకీవైరస్ A16, ఎంట్రోవైరస్-71 వలన సంభవిస్తుంది. మురికి చేతులు, కలుషితమైన ఉపరితలాలు లేదా ప్రత్యక్ష సంబంధం ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. వర్షాకాలంలో వైరస్ మరింత చురుకుగా మారడంతో కేసులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. పాఠశాలలు, డేకేర్‌లు, ప్లే గ్రూప్‌ల వంటి ప్రదేశాలలో పిల్లల ద్వారా ఇది త్వరగా వ్యాపిస్తుంది.
హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ వ్యాధి ప్రధాన లక్షణాలు:
వైరస్ సోకిన 3-5 రోజుల తర్వాత లక్షణాలు కనిపిస్తాయి. తేలికపాటి నుంచి మధ్యస్థ జ్వరం, గొంతు నొప్పి, మింగడానికి కష్టం, ఆకలి లేకపోవడం, నోటిలో బాధాకరమైన పుండ్లు లేదా ఎర్రటి దద్దుర్లు, చేతులు, కాళ్లు, మోచేతులు, మోకాళ్లు లేదా పిరుదులపై ఎర్రటి దద్దుర్లు/పొక్కులు, చాలా మంది పిల్లలు వారం నుంచి 10 రోజుల్లో కోలుకుంటారు. వైరస్ లాలాజలం, ముక్కు స్రావం, పొక్కుల నుంచి వచ్చే ద్రవం, మలం ద్వారా కూడా వ్యాపిస్తుంది. లక్షణాలు కనిపించకముందే కొందరిలో వైరస్ వ్యాప్తి చెందుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు దీని బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది.
ఇది కూడా చదవండి: శ్వాస తీసుకునే సమయంలో ఇలా అనిపిస్తే డేంజర్!
అయితే బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న పెద్దలు కూడా దీనికి గురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి HFMDకి నిర్దిష్టమైన మందు లేదా వ్యాక్సిన్ లేదు. చికిత్స ప్రధానంగా లక్షణాల ఉపశమనంపై దృష్టి పెడుతున్నారు. జ్వరం, నొప్పి కోసం వైద్యుడి సలహా మేరకు పారాసెటమాల్ ఇవ్వాలి, డీహైడ్రేషన్‌ను నివారించడానికి తగినంత ద్రవాలు అందించాలి. చేతులను శుభ్రంగా కడుక్కోవడం, అనారోగ్యంతో ఉన్న పిల్లలను ఐసోలేట్ చేయడం ప్రస్తుతానికి ఉత్తమ నివారణ చర్యలు. పాఠశాలలు, కుటుంబాలు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఇలాంటివి మీ నిత్యకృత్యాల్లో ఉన్నాయా..? అయితే మీ బొక్కలు డొల్ల కావడం ఖాయం..!!