మ్యాట్రిమోనీలో పరిచయం..కోటి రూపాయలు మోసం!
ఓ మ్యాట్రిమోనీ సైట్ లో పరిచయమైన ఓ లేడీ...ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ ను బోల్తా కొట్టించింది. దాదాపు అతని వద్ద నుంచి రూ. కోటి 14 లక్షలు వసూలు చేసింది. పెళ్లి చేసుకుందామని అడిగితే ముఖం చాటేయడంతో మోసపోయానని గుర్తించిన బాధిత యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.