/rtv/media/media_files/2025/02/20/fdNiaQ4esfZdvtbAU47H.jpg)
Chinese company restrict employees to 2-minute toilet breaks
VIRAL NEWS: సాధారణంగా టాయిలెట్ వచ్చినపుడు ఆపుకుంటే వచ్చే అనర్థాలేంటో వైద్యులు తరచూ చెప్తుంటారు. కానీ ఓ కంపెనీ మాత్రం టాయిలెట్ వచ్చినా ఆపుకోవలసిందే అంటూ తమ ఉద్యోగులకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. టాయిలెట్ బ్రేక్(Toilet Break) మేం మాత్రమే నిర్ణయిస్తాం.. ఆ టైంలోనే వెళ్లాలి. లేదు, కుదరదు మాకు నచ్చినపుడే వెళ్తాం అంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయ్. ఫైన్ కూడా కట్టాల్సి వస్తుంది అని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడది బయటకు రావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ మేరకు ఆ కంపెనీపై మండిపడుతున్నారు. ఇది ఎక్కడ జరిగింది. ఎందుకు ఈ రూల్ పెట్టారు అనే విషయానికొస్తే..
2 నిమిషాలే బ్రేక్
ఈ రూల్ పెట్టింది మన దేశంలో కాదు. దక్షిణ చైనాలో. అక్కడ త్రీ బ్రదర్స్ మెషీన్ అనే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ.. తమ ఉద్యోగులు పని చేసే టైంలో టాయిలెట్ వాడటానికి కొన్ని రూల్స్ పెట్టింది. ఉద్యోగులు ఎవరైనా టాయిలెట్‌కి వెళ్లాలంటే కేవలం 2 నిమిషాల్లో వెళ్లి రావాలి అని తెలిపింది. అది కూడా మీకు నచ్చినపుడు కాదని.. కేవలం కంపెనీ ఫిక్స్ చేసిన టైంలో మాత్రం టాయిలెట్ బ్రేక్ తీసుకోవాలని రూల్ పాస్ చేసింది. ఈ రూల్‌ను ఎవరైనా అతిక్రమిస్తే.. ఫైన్ విధిస్తామంటూ తమ ఉద్యోగులకు హెచ్చరించింది.
Also Read: USA: అబ్బా మళ్ళీ కొట్టాడు..ఔషధాలపై 25శాతం సుంకం ప్రకటన..కుప్పకూలిన ఫార్మా స్టాక్స్
టాయిలెట్ టైమింగ్స్
ఈ మేరకు టాయిలెట్ టైమింగ్స్ వెల్లడించింది. ఉదయం 8 గం.లకు ముందు వెళ్లాలని తెలిపింది. అలాగే 10:30 గం.ల నుండి 10:40 గం.ల వరకు, మధ్యాహ్నం 12 గం.లకు, 1: 30 గం.లకు, సాయంత్రం 3:30గం.ల నుండి 3:40గం.ల వరకు, 5:30 గం.ల నుండి 6గం.ల వరకు టాయిలెట్ బ్రేక్ సమయాన్ని కంపెనీ ఫిక్స్ చేసింది. ఇక ఓవర్ టైం వర్క్ చేసేవారు రాత్రి 9 గం.ల తర్వాత టాయిలెట్ వాడుకోవచ్చని తెలిపింది.
Also Read: America: పనామా హోటల్ లో 300 మంది భారతీయులు సాయం కోసం కేకలు!
అసలు కారణం ఇదే
అయితే ఈ రూల్ పెట్టడం వెనుకున్న అసలు ఉద్దేశాన్ని ఆ కంపెనీ తెలిపింది. ఉదయం, మధ్యాహ్నం టైంలో టాయిలెట్ వాడకంపై నిషేధాన్ని విధించడమే దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. ఇక ఈ విషయంలో మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నవారు HRను సంప్రదించి పర్మిషన్ తీసుకోవాలని తెలిపింది. ఫిబ్రవరి 11 నుంచి ఈ రూల్‌పై ట్రయల్ నిర్వహిస్తున్నారు. దీనిని పూర్తి స్థాయిలో మార్చి 1 నుంచి అమలు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దీని కోసం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం గమనార్హం.