India Census : జనగణన తొలిదశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..నోటిఫికేషన్ జారీ

దేశవ్యాప్తంగా జనగణన జరిపేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. తొలిసారిగా డిజిటల్‌ విధానంలో జరగనున్న జనగణనకు రంగం సిద్ధమైంది. తొలి దశలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి గృహగణన చేపట్టనుంది. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 30వ తేదీతో ముగియనుంది.

New Update
Caste census

National Census

India Census :  దేశవ్యాప్తంగా జనగణన జరిపేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. తొలిసారిగా డిజిటల్‌ విధానంలో జరగనున్న జనగణనకు రంగం సిద్ధమైంది. తొలి దశలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి గృహగణన చేపట్టనుంది. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 30వ తేదీతో ముగియనుంది. తొలి విడతలో భాగంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు ఇళ్ల వివరాలను సేకరించనున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రతి రాష్ట్రానికి 30 రోజుల వ్యవధి ఉంటుందని పేర్కొంది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.హౌస్ లిస్టింగ్‌లో భాగంగా అన్ని రకాల ఇళ్లు, నివాసాలు, భవనాలు, నిర్మాణాల వివరాలను సేకరించనున్నారు. modi-on-caste-census

Also Read :  భారీగా పెరిగిన MPల ఆస్తులు.. రాహుల్ గాంధీ 117%, ప్రధాని మోదీ 80%

Center Gives Green Signal For First Phase Of Census

కాగా దేశంలో ప్రతి పదేళ్లకు ఒకసారి జనగణన(BC Caste Census) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 2021లో ఈ జనగణన నిర్వహించాల్సి ఉండగా కొవిడ్ కారణంగా.. ఈ ప్రక్రియను వాయిదా వేశారు. తాజాగా ఈ జన గణన ప్రక్రియను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఈ ప్రక్రియను రెండు దశల్లో నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. తొలి దశలో ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు నిర్వహించనుండగా. ఇక రెండో దశలో వచ్చే ఏడాది అంటే.. 2027 ఫిబ్రవరి నుంచి మార్చి 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ ప్రారంభానికి ముందు పదిహేను రోజుల పాటు స్వీయ గణనకు ఆప్షన్‌ కూడా ఉంటుందని తెలిపింది.

జనాభా లెక్కల సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ జనాభా లెక్కలు పూర్తిగా డిజిటల్ రూపంలో చేయనున్నట్లు ప్రభుత్వ ప్రకటించింది.  జనగణనతోపాటే కులగణనను సైతం చేపట్టాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో కులగణన ప్రక్రియను చేపట్టి.. పూర్తి చేసింది. కాగా, ఈ దఫా జనాభా లెక్కింపు అంతా డిజిటల్‌ విధానంలో నిర్వహించనున్నట్లు కేంద్రం ఇదివరకే స్పష్టం చేసింది. మొబైల్‌ యాప్‌ల ద్వారా జనాభా లెక్కల సమాచారాన్ని సేకరించనున్నారు, స్వీయ గణనకు ఇదెంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది. మరోవైపు, జనగణనతోపాటే కుల గణనను కూడా చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.

'హౌస్ లిస్టింగ్, గణన' కోసం ఏప్రిల్‌ నుంచి దేశంలోని ప్రతీ ఇంటిని క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎలా చేరుకోవాలి?  అనే అంశంపై అధికారులు కసరత్తు చేశారు.ఇంటి యజమానులను ఏయే ప్రశ్నలు అడిగి, ఎలాంటి సమాచారం సేకరించాలి? మొబైల్‌ యాప్‌ను ఎలా వాడాలి? అంశంపై అవగాహన కల్పించారు. డిజిటల్‌గా సమాచారాన్ని నమోదు చేసే క్రమంలో ఉపయోగపడే భద్రతా ఫీచర్లు ఏమిటి? సిబ్బందిని రాష్ట్ర, జిల్లా, ఉప జిల్లా స్థాయుల్లో ఎలా వినియోగించాలి? అధికారులు ఎలా సమన్వయం చేసుకోవాలి? అనే అంశాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికి ఇటీవలే  ప్రీ-టెస్ట్‌ ప్రక్రియను నిర్వహించారు. దాని ఆధారంగా జనగణన చేపడుతారు.ఇక దేశంలో మంచుతో కూడిన ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లద్దాఖ్, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో జనాభా లెక్కల ప్రక్రియను 2026 సెప్టెంబరు నుంచి అక్టోబరు 1 వరకు నిర్వహించనున్నారు.  PM Narendra Modi

Also Read :  ఐపాక్ ఆఫీస్‌లో ED సోదాలు.. అధికారుల నుంచి ఫైల్స్ లాక్కున్న CM మమతా బెనర్జీ

Advertisment
తాజా కథనాలు