పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రేపటి నుంచే (నవంబర్ 25) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంటు ఉభయ సభల్లోని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్‌లతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. అయితే ఈ సమావేశం వాడీవేడిగా జరిగినట్లు తెలుస్తోంది.
Also Read: మహా సీఎంగా ఎవరూ ఊహించని వ్యక్తి.. BJP సంచలన వ్యూహం!
అదానీ గ్రూప్‌పై అమెరికా లంచం ఆరోపణలు చేయడం, మణిపుర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు తదితర విషయాలపై ఈ సమావేశాల్లో చర్చించాల్సిందిగా కాంగ్రెస్ పిలుపునిచ్చినట్లు ఈ పార్టీ నేత ప్రమోద్ తివారీ తెలిపారు. అలాగే ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న కాలుష్యం, రైలు ప్రమాదాలు వంటి విషయాలపై చర్చిస్తామని తెలిపారు.
Also Read: వాహనదారులకు బిగ్ షాక్.. రూల్స్ అతిక్రమిస్తే ఇకపై క్రిమినల్ కేసులే!
ఇక పార్లమెంటు శీతాకాల సమావేశాలు.. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు జరగనున్నాయి. అయితే భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని.. నవంబర్ 26న ఈ సమావేశాలు జరగవని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే పాత పార్లమెంటు భవనంలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్‌లో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని జరపనున్నారు. వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటు చేసిన పార్లమెంటు సంయుక్త కమిటీ నవంబర్ 29న తన నివేదికను సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు 2024ను కూడా ప్రవేశపెట్టనున్నారు. అలాగే జమిలీ ఎన్నికల బిల్లును కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం.
Also Read: 50 ఏళ్ళల్లో ఈ కూటమీ ఇంతటి విజయాన్ని సాధించలేదు– మోదీ
Also Read: విమానాల మీద నుంచి ఇరాన్ క్షిపణులు–చూసిన పైలట్లు, ప్రయాణికులు