Delhi: 50 ఏళ్ళల్లో ఈ కూటమీ ఇంతటి విజయాన్ని సాధించలేదు– మోదీ మహారాష్ట్రలో మహాయుతి అఖండ విజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం సాధించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. మహారాష్ట్రలో అభివృద్ధి, సుపరిపాలన, నిజమైన సామాజిక న్యాయమే గెలిచాయని.. అబద్ధాలు, మోసం ఘోరంగా ఓడిపోయాయన్నారు. By Manogna alamuru 23 Nov 2024 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి అన్ని రికార్డ్‌లను బ్రేక్ చేసిందని ప్రధాన మోదీ అన్నారు. గత 50 ఏళ్ళల్లో ఏ కూటమీ సాధించిన విజయాన్ని మహాయుతి సాధించిందని చెప్పారు. వరుసగా మూడుసార్లు బీజేపీకి అధికారం అందించిన ఆరో రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచిందని మోదీ చెప్పారు. ఏక్ హై తో సేఫ్ హై అనే నినాదమే ఇప్పుడు దేశానికి మహామంత్రంగా మారిందని చెప్పారు. పనిలో పనిగా కాంగ్రెస్ మీద కూడా విమర్శల వర్షం కురిపించారు. అధికారం కోసం దురాశతో కులతత్వం అనే విషాన్ని వ్యాపింపజేస్తోందని మండిపడ్డారు. అర్బన్ నక్సలిజానికి కాంగ్రెస్ కేరాఫ్ అడ్రస్ అంటూ విరుచుకుపడ్డారు. మహారాష్ట్రలో అస్థిరతను సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని.. దీనికి ఓటర్లే శిక్షించారని ప్రధాని అన్నారు. దేశానికి ప్రథమస్థానం ఇచ్చేవారితోనే తప్ప కుర్చీకి ప్రాధాన్యం ఇచ్చేవారితో ఓటర్లు ఉండరని వ్యాఖ్యానించారు. Also Read: MH: హమ్మయ్య ధారావి ప్రాజెక్టు సేఫ్...ఆదానీకి కాస్త ఊరట మహారాష్ట్ర లేదా దేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఇండియా కూటమి అర్ధం చేసుకోలేక పోయిందని ప్రధాని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ ఇప్పుడొక పరాన్నజీవి...అది ఎప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. Also Read: Election Results: మహారాష్ట్రలో బీజేపీ, మహాయుతి గెలుపుకు కారణాలు ఇవే.. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి