Iran: విమానాల మీద నుంచి ఇరాన్ క్షిపణులు–చూసిన పైలట్లు, ప్రయాణికులు

ఇరాన్ దాడులను తాము ప్రత్యక్షంగా చూశామంటున్నారు ప్రయాణికులు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ప్రయాణించామని చెప్పారు. అక్టోబర్‌‌లో ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు తాము ప్రయాణిస్తున్న విమానాల మీద వెళ్ళాయని తెలిపారు. 

New Update
missiles

Iran balistic Missiles: 

అక్టోబర్‌‌లో ఇజ్రాయెల్ మీద ఇరాన్ ఒక్కసారిగా విరుచుకుపడింది. దీని గురించి ఎవరికీ ఎటువంటి సమాచారం లేదు. కనీసం ఊహించను కూడా ఊహించలేదు ఇరాన్ దాడి చేస్తుందని. దాదాపు ఒకేసారి 200 బాలిస్టిక్ క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. అలా అప్పుడు ప్రయోగించిన బాంబ్‌లు పౌర విమానాల మీద నుంచి వెళ్ళాయని వాల్ స్ట్రీట్ జర్నల్‌లో రాసుకొచ్చింది. అవి ఇజ్రాయెల్‌ దిశగా దూసుకు వెళ్లే సమయంలో ఆ మార్గంలో దాదాపు డజను విమానాలు ఉన్నట్లు తెలిపింది. ఇవన్నీ అప్పుడు ఇరాన్‌, ఇరాక్‌ ఆకాశంలో ఉన్నాయి. కొందరు పైలట్లు, ప్యాసింజర్లు ఈ అగ్ని గోళాలను స్వయంగా చూశారు అని చెప్పింది.  

Also Read: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్‌ వైరల్‌!

బాలిస్టిక్ క్షిపణులు సాధారణంగా విమానాల కన్నా పై నుంచి వెళతాయి. అవి కిందకు పడినప్పుడు లేదా పైకి వెళ్ళినప్పుడు మాత్రమే ప్రమాదకరంగా మారతాయి. దాడి చేస్తున్నప్పుడు ఇరాన్ ఎవరినీ హెచ్చరించలేదు. అదృష్టవశాత్తు అవి ఏ విమానాన్ని ఢీకొనలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే వందల మంది ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. అదృష్టవశాత్తు చాలామంది పైలెట్లు పరిస్థితిని పసిగట్టి తమ విమానాల దారి మళ్లించుకోవడంతో కూడ ప్రమాదాలు తప్పాయి.  

Also Read: ఆర్జే వెంచర్స్‌ రూ.150 కోట్ల బిగ్ స్కామ్.. 600 మందిని మోసం చేసిన కంపెనీ

ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌ 2’ పేరిట ఇరాన్ ఈ దాడులను చేసింది. ఇజ్రాయెల్‌లోని నెవాటిమ్ ఎయిర్‌ బేస్‌తో పాటు అక్కడున్న ఎఫ్‌-35 ఫైటర్‌ జెట్లు, నెవాటిమ్‌ మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకొన్నట్లు తెలిపింది. కాగా.. ఇరాన్‌ దాడుల తర్వాత కొన్ని వారాలకు ఇజ్రాయెల్‌ ప్రతిదాడులు చేసింది. దీనిలో టెహ్రాన్‌ ఆయుధ తయారీ, సైనిక స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 

Also Read: AP: తప్పు చేసిన వ్యక్తి ఎవరైనా సహించేది లేదు–ఏపీ సీఎం చంద్రబాబు

Also Read: జగన్ కు చంద్రబాబు సర్కార్ బిగ్ షాక్.. అదానీ వ్యవహారంపై విచారణ?

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు