వాహనదారులకు బిగ్ షాక్.. రూల్స్ అతిక్రమిస్తే ఇకపై క్రిమినల్ కేసులే!

వాహనాలపై అనాధికార స్టిక్కర్లు అమర్చి, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తున్నట్లయితే క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఎమ్మెల్యే ఆన్ డ్యూటీ, ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అనే స్టిక్కర్లు ఉంటే ఎంవీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయనున్నారు.

New Update
Bengaluru:270సార్లు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణ..1.36 లక్షల జరిమానా

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే పోలీసులు ఇప్పటి వరకు జరిమానాలే విధించేవారు. కానీ ఇకపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయనున్నట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. వాహనాలపై అనాధికార స్టిక్కర్లు ఉంటే యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు.

ఇది కూడా చూడండి: MH: మహారాష్ట్రలో పని చేసిన పవన్ ప్రచారం..ఒక్క చోట మాత్రం..

ఎంవీ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసు..

కొందరు అనాధికార స్టిక్కర్లు అమర్చడంతో పాటు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఆన్ డ్యూటీ, ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అనే స్టిక్కర్లు ఉంటే ఎంవీ యాక్ట్ ప్రకారం ఇకపై కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలా ఎమ్మెల్యేల స్టిక్కర్లతో కొందరు దుర్మార్గానికి పాల్పడుతన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇది కూడా చూడండి: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

కొంతమంది వాహనదారులు ప్రభుత్వ ఉద్యోగస్తులకు అద్దెకు వాహనాలు పెడుతుంటారు. ఈ క్రమంలో ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని స్టిక్కర్లు అతికిస్తారు. ఎప్పుడో ఇలాంటి స్టిక్కర్లు అతికించిన కూడా ఇప్పటికీ తీయరు. వాళ్లు ఆ స్టిక్కర్లతో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ఇది కూడా చూడండి: నేడే ఐపీఎల్ మెగా వేలం.. ఏ ఫ్రాంఛైజీ దగ్గర ఎంత ఉందంటే?

ఇదిలా ఉండగా ఇటీవల సంతోష్ నగర్‌లో ఓ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారును పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కారు ఖరీదుగా ఉండటంతో పాటు లోపల సైరన్ కూడా ఉంది. కానీ కారు లోపల ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వారు కారుకి ఎమ్మెల్యే స్టిక్కర అతికించినట్లు గుర్తించారు. దీంతో పాటు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ కూడా ఉంది. 

ఇది కూడా చూడండి: పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది..చంద్రబాబుపై రాళ్ల దాడి కేసులో సంచలనాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు