Maharashtra CM: మహా సీఎంగా ఎవరూ ఊహించని వ్యక్తి.. BJP సంచలన వ్యూహం!

మహారాష్ట్ర సీఎంపై బీజేపీ కొత్త వ్యూహాన్ని రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఫడ్నవీస్ ను కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకొని.. కొత్త వ్యక్తిని సీఎం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. RSS మాత్రం ఫడ్నవీస్ నే సీఎం చేయాలని పట్టుబడుతున్నట్లు సమాచారం.

New Update
Devendra Fadnavees Modi Amith Shah

మహారాష్ట్రలో 230 సీట్లలో భారీ విజయంతో అధికారంలోకి వచ్చిన మహాయుతి కూటమి నుంచి సీఎం ఎవరు అవుతారు? అన్న చర్చ ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. 132 సీట్లలో బీజేపీ విజయం సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ మహారాష్ట్రలో మేజిక్ ఫిగర్ 145. దీంతో ఆ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు. కూటమిలోని మూడు ప్రధాన పార్టీల నేతలు ఫడ్నవీస్, ఏక్ నాథ్ షిండే, అజిత్ పవర్ ముగ్గురు సీఎం కుర్చీపై ఆశ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో శిందే ప్రస్తుత సీఎం కాగా.. ఫడ్నవీస్ మాజీ సీఎం, ఇప్పుడు డిప్యూటీ సీఎం. కూటమి గెలుపులో షిండే, ఫడ్నవీస్ కీలక పాత్ర పోషించారు. దీంతో వీరిద్దరి మధ్య పోటీ ప్రధానంగా ఉందన్న చర్చ సాగుతోంది.
ఇది కూడా చదవండి: Nagababu : ప్రతి హీరో నాయకుడు కాలేడు.. పవన్ పై నాగబాబు సంచలన ట్వీట్

అయితే.. బీజేపీ హైకమాండ్ ఆలోచన ఏంటన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఆర్ఎస్ఎస్ మాత్రం ఫడ్నవీస్ సీఎం కావాలని తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. బీజేపీ హైకమాండ్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఫడ్నవీస్ ను కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకోవాలని ఆ పార్టీ హైకమాండ్ ఇప్పటికే డిసైడ్ అయ్యిందన్న ప్రచారం సాగుతోంది. ఎవరూ ఊహించని కొత్త నేతను రాష్ట్రంలో తెరపైకి తెచ్చే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. అంటే మధ్య ప్రదేశ్ ఫార్ములాను బీజేపీ ఫాలో అవుతుందన్న చర్చ సాగుతోంది. 
ఇది కూడా చదవండి: జార్ఖండ్‌లో కౌంటింగ్ పూర్తి..ఇండియా కూటమికి వచ్చిన సీట్లు ఎన్నో తెలుసా?

మరికొన్ని రోజులు షిండేనే..?

అయితే.. షిండే ఇప్పటికప్పుడే సీఎం పదవి నుంచి తప్పించకపోవచ్చని, కొన్నాళ్ల పాటు ఆయనను కొనసాగించవ్చన్న ప్రచారం సాగుతోంది. స్థానిక ఎన్నికలు, మరాఠా రిజర్వేషన్లపై న్యాయస్థానం నిర్ణయం వచ్చే వరకు ఆయననే సీఎంగా ఉంచాలన్నది బీజేపీ హైకమాండ్ ఆలోచనగా తెలుస్తోంది. ఆ తర్వాత బీజేపీ నుంచి ఎవరూ ఊహించని కొత్త వ్యక్తి సీఎం అవుతారన్న ఊహానాగాలు సాగుతున్నాయి.

ఆ మహిళా నేతకు చాన్స్ దక్కేనా?

అయితే.. 2014లో అధికారంలోకి వచ్చిన సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు వినోద్ తావ్డే, పంకజ, ఏక్‌నాథ్ ఖడ్సే ముండే తదితరులు సీఎం రేసులో ఉన్నారు. అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఖడ్సే శరద్ పవార్ నేతృత్వంలోని NCPలో ఉన్నారు. దీంతో పంకజ ముండేకు మహిళా కోటాలో ఛాన్స్ వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. అయితే.. లోక్ సభ ఎన్నికల్లో ఓటమి పాలవ్వడం ఆమెకు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఫడ్నవీస్ ను కాదంటే ఎవరూ ఊహించని మరో కొత్త పేరు తెరపైకి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు