USA Visas: ఆలస్యమవుతున్న వీసా అపాయింట్ మెంట్లు..నానాపాట్లు పడుతున్న హెచ్1 వీసాదారులు..

సోషల్ మీడియా స్క్రీనింగ్ కారణంగా వీసా అపాయింట్ మెంట్లు అంతకంతకూ వెనక్కు వెళ్ళిపోతున్నాయి. దీనివలన ఉద్యోగులు నానాపాట్లు పడుతున్నారు. ఉద్యోగాలు ఉంటాయో, పోతాయో తెలియక సతమతమవుతున్నారు.

New Update
Employees in 40s now top layoff targets, warns Bombay Shaving Company CEO

Employees in 40s now top layoff targets, warns Bombay Shaving Company CEO

ఆలస్యమవుతున్న వీసా అపాయింట్ మెంట్లు..నానాపాట్లు పడుతున్న హెచ్1 వీసాదారులు..అమెరికా వీసాల ప్రాసెసింగ్ లో అంతరాయాలు చాలా ఇబ్బందులకు గురిచేస్తోంది. హెచ్ 1బీ, ఎల్, ఎఫ్, జే తదితర వీసాల ఇష్యూలో అవలంబిస్తున్న విధానాలు ఉద్యోగులకు, స్టూడెంట్లకు నరకంగా మారింది. హెచ్ 1బీ వీసా ఫీజు పెంపుతో అమెరికా రావడమే కష్టమైపోయింది అంటే..ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. డిసెంబర్ 15 నుంచి మొదలెట్టిన సోషల్ మీడియా స్క్రీనింగ్ వల్ల వీసా అపాయింట్ మెంట్లు అసలు దొరకడం లేదు. ఉన్నవి కూడా పోస్ట్ పోన్ అయిపోయాయి. అది కూడా ఏకంగా ఎనిమిది, తొమ్మిది నెలలు వెనక్కు వెళ్ళిపోయాయి. సోషల్ మీడియా స్క్రీనింగ్ కు చాలా టైమ్ పడుతోందని..అందువల్లే వీసా అపాయింట్ మెంట్లలో జాప్యం జరుగుతోందని యూఎస్ ఇమ్మిగ్రేషన్డిపార్ట్ మెంట్ చెబుతోంది. కానీ దీని వలన తమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఉద్యోగులు అంటున్నారు.

తన ఉద్యోగం ఉందో లేదో..

తన వీసా పునరుద్ధరణ అపాయింట్‌మెంట్ అకస్మాత్తుగారీషెడ్యూల్ చేయడం వలన తమ పడుతున్నకష్టాలనుహెచ్ 1బీ ఉ్యోగులు పంచుకుంటున్నారు. దీని వన తమ లైఫ్ లో స్పష్టత లేకుండా పోయిందని చెబుతున్నారు. దీని గురించి వర్క్‌ప్లేస్ ఫోరమ్ బ్లైండ్‌లో తన బాధలను పంచుకున్నారు. తన వీసా అపాయింట్ మెంట్ వాయిదా పడిందని..దీంతో తన ఉద్యోగం ఉందో లేదో తెలియడం లేదని చెబుతున్నారు. కంపెనీ కూడా దీని గురించి స్పష్టత ఇవ్వడం లేదనిఅంటున్నారు. జీతం రావడం లేదు..అసలు ఉద్యోగం ఉంచారో లేదో కంపెనీ చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిమోట్ వర్క్ చేస్తానని చబుతున్నాహెచ్ఆర్ సమాధానం వ్వడం లేదని చెబుతున్నారు. వీసా వచ్చే వరకు జీతం లేని సెలవులో ఉంటున్నానా అనే విషయంపై కూడా క్లారిటీ ఇవ్వడం లేదని అంటున్నారు. ఈ పరిస్థితి చాలా గందరగోళంగా ఉందని..వేరేఉద్యగం వెతుక్కునే పరిస్థితి కూడా కనిపించడం లేదని చెబుతున్నారు.

https://www.teamblind.com/post/h1b-appointment-delayed-stuck-in-india-and-company-ghosting-me-wtf-do-i-do-dh5gdbz8

గందరగోళంలో చాలామంది..

సోషల్ మీడియా వెట్టింగ్ గురించి యూఎస్ ఇమ్మిగ్రేషన్డిపార్ట్ మెంట్ సడెన్ గా అనౌన్స్ చేసింది. దాని గురించి చెప్పిన తర్వాత కూడా చాలా మందికి వీసా అపాయింట్ మెంట్ల గురించి క్లారిటీ లేదు. దీంతో చాలా మంది అమెరికా నుంచి తమ స్వదేశాలకు వెళ్ళిపోయారు. కానీ అక్కడకు వెళ్ళాక పరిస్థితి వరస్ట్ అయిపోయింది. వీసా అపాయింట్ మెంట్లు వాయిదా పడిపోయాయి. ఇది వారి జీవితాలను తారుమారు చేసేస్తోంది. చాలా మంది కుటుంబాల్లో ఒక్కరే వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. దీంతో ఫ్యామిలీ ఒకరు ఒకచోట..మరొకరు మరోచోట ఉండిపోయి ఇబ్బందులు పడుతున్నారు. రెండు వారాల్లో వందల మంది ఈ వీసా అపాయింట్ మెంట్ల ద్వారా కష్టాలు పడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. కంపెనీలు కూడా ఎవ్వరినీ ఎక్కడికీ కదలొద్దుఅంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఆల్రెడీ వెళ్ళిన వారు తమతో ప్రత్యేకంగా మాట్లాడాలని...ఏం చేయాలో కలిసి నిర్ణయించుకుందామని చెబుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు