Explainer: డ్యూటీ టైం తర్వాత నో ఆఫీస్ కాల్స్, మెయిల్స్.. పార్లమెంట్ లో రైట్ టూ డిస్‌కనెక్ట్ బిల్!

భారత పార్లమెంటులో డిస్ కనెక్ట్ రైట్ అనే బిల్లును ప్రవేశపెట్టారు. పని వేళ అయిపోయాక కాల్స్ ఉండకూడదు అంటూ ఇందులో ప్రతిపాదించారు.  వ్యక్తిగత జీవితానికి, వృత్తిపరమైన జీవితానికి మధ్య బ్యాలెన్స్ తీసుకురావడానికే దీనిని ప్రతిపాదించారు.

New Update
work

శీతాకాలం లోక్ సభ(loksabha) సమావేశాల్లో ఉద్యోగులకు అత్యంత అవసరమైన వర్క్ లైఫ్ బ్యాలెన్ పై డిస్కషన్ జరిగింది. అధికార పని వేళల తర్వాత వర్క్ నుంచి డిస్ కనెక్ట్ అవ్వాలని, కాల్స్ ఉండకూడదంటూ లోక్ సభ సభ్యురాలు సుప్రియా సూలే(Supriya Sule) లోక్ సభలో డిస్ కనెక్ట్ రైట్స్ బిల్లు(new-bill) ను ప్రవేశపెట్టారు. పనివేళలు ముగిసిన తర్వాత, సెలవు రోజుల్లో వచ్చే ఆఫీస్ ఫోన్ కాల్స్, ఈ-మెయిల్స్‌కు స్పందించకుండా ఉండే హక్కును ఉద్యోగులకు చట్టబద్ధంగా కల్పించాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు.  కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన 4 కొత్త లేబర్ కోడ్స్‌పై కార్మిక సంఘాల నుంచి ఆందోళన, వ్యతిరేకత వ్యక్తమౌతున్న తరుణంలో ఈ ప్రైవేట్ బిల్లులు రావడం ఆసక్తి రేపుతోంది.

Also Read :  భారత్ లో మైక్రోసాఫ్ట్ ఏఐ హబ్.. ప్రధాని మోదీను కలిసిన సత్య నాదెళ్ళ

ఏంటీ చట్టం..దేని కోసం ఈ బిల్లు..

ప్రస్తుతం నడుస్తున్నది డిజిటల్ యుగం. ఈ రోజుల్లో ఉద్యోగులకు పని పెరిగిపోతోంది. దీని కారణంగా వారి జీవితాల్లో ఒత్తిడి కూడా పెరిగిపోతోంది. దీనిని తగ్గించి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ రైట్ టూ డిస్ కనెక్ట్ బిల్లును ప్రవేశపెట్టామని సుప్రియా సూలే వివరించారు.  పని తర్వాత వ్యక్తిగత సమయాన్ని కాపాడేందుకే దీన్ని తీసుకువచ్చారు. ఇంటికి వెళ్లాక ఆఫీసు నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెయిల్స్, మెస్సేజెస్‌ను తిరస్కరించే హక్కు ఇది. డిజిటల్ యుగంలో ఉద్యోగులు ఏ పరిస్థితుల్లో ఉన్నా, సిక్ లీవ్ లో ఉన్నా కూడా వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. దీంతో వ్యక్తిగత జీవితానికి, వృత్తిపరమైన జీవితానికి మధ్య ఉన్న రేఖలు చెరిగిపోయాయి. దీని వలన మనుషుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోంది.

వీటితో పాటూ  ఉద్యోగులకు మెరుగైన విశ్రాంతి ఇస్తే పని కూడా బాగుపడుతుందని అంటున్నారు. దీని కారణంగా నిర్ణీత పని వేళల్లో ఉద్యోగులు మరింత దృష్టి పెట్టడానికి ఇది సహాయపడుతుంది. టెక్నాలజీ ప్రభావం కాస్త తగ్గుతుంది. దీని కోసమే డిస్ కనెక్ట్ రైట్స్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ నిబంధనను కంపెనీలు ఉల్లంఘిస్తే మొత్తం వేతన చెల్లింపులో 1 శాతం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే దీనిపై ప్రస్తుతం ఇంకా డిస్కషన్ జరుగుతోంది. ఇది అమల్లోకి వస్తుందో రాదో మాత్రం వేచి చూడాలి. 

Also Read :  పరారీలో గోవా నైట్ క్లబ్ యజమానులు.. బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసిన పోలీసులు

ఏఏ దేశాల్లో ఉంది..

ఇలాంటి బిల్లు ఇప్పటికే చాలా దేశాల్లో అమల్లో ఉంది. స్పెయిన్, ఫ్రాన్స్, అమెరికా, బెల్జియం, ఇటలీ, ఐర్లాండ్ దేశాల్లో అమల్లో ఉంది. ఆస్ట్రేలియాలో కూడా తాజాగా అమలు చేశారు. ప్రపంచంలో మొట్ట మొదటిసారిగా 2017లో ఫ్రాన్స్ ఈ చట్టం తీసుకొచ్చింది. ఆ తరువాత 2018లో స్పెయిన్ డేటా ప్రొటెక్షన్ చట్టంలో భాగంగా ఈ హక్కు తీసుకొచ్చింది. ఇక 2022లో బెల్జియం కూడా ఈ చట్టాన్ని అమలు చేసింది.

Advertisment
తాజా కథనాలు