UP Crime : బరితెగించింది.. భర్తను బతికుండగానే పాతిపెట్టాలని చూసింది... డ్యామిట్ కథ అడ్డం తిరిగింది!

భర్తను బతికుండగానే పాతిపెట్టాలని చూసింది ఓ భార్య. తన ఐదుగురి సోదరుల సహకారంతో తన భర్తను చంపేందుకు యత్నంచింది. భర్తపై దాడి చేయించి, అతడి కాళ్లు, చేతులు విరగొట్టి సమీప అడవిలో పూడ్చిపెట్టేందుకు ప్లాన్ వేసింది.

New Update
wife and husband

భర్తను బతికుండగానే పాతిపెట్టాలని చూసింది ఓ భార్య. తన ఐదుగురి సోదరుల సహకారంతో తన భర్తను చంపేందుకు యత్నంచింది. భర్తపై దాడి చేయించి, అతడి కాళ్లు, చేతులు విరగొట్టి సమీప అడవిలో పూడ్చిపెట్టేందుకు ప్లాన్ వేసింది.  అయితే  అటు వైపుగా వచ్చిన  ఓ వ్యక్తి దానిని చూడటంతో  అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. దీంతో వెంటనే బాధితుడిని ఆసుపత్రిలో చేర్పించాడు ఆ వ్యక్తి. యూపీలోని బరేలీలో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. 

ఈ సంఘటన ఇజ్జత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. డాక్టర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రాజీవ్ భార్య సాధన ఈ హత్యకు స్కెచ్  వేసింది. భగవాన్ దాస్, ప్రేమ్‌రాజ్, హరీష్, లక్ష్మణ్ సహా తన ఐదుగురు సోదరులను హత్య చేయడానికి కొంతమంది గూండాలను నియమించింది. 

జూలై 21 రాత్రి మొత్తం 11 మంది రాజీవ్‌పై అతని ఇంట్లో దాడి చేశారు. అతని చేయి, రెండు కాళ్లను విరిచారు. అనతంరం అతన్ని సజీవంగా పాతిపెట్టాలని పథకం వేశారు. ప్లాన్ లో భాగంగా గంజ్ ప్రాంతంలోని ఒక అడవికి తీసుకెళ్లి అక్కడ పాతిపెట్టడానికి ఒక గొయ్యి తవ్వారు. కానీ అతన్ని పాతిపెట్టే ముందు, ఒక అపరిచితుడు అక్కడికి వచ్చాడు, నిందితులు భయపడి అన్ని అక్కడే వదిలేసి అక్కడినుంచి పారిపోయారు. 

Also Read : 310 ఏళ్లుగా అదే రుచి.. అదే నాణ్యత.... తిరుపతి లడ్డు మొదట ఎలా ఉండేదంటే..?

అంబులెన్స్‌కు ఫోన్ చేసి

ఎముకలు విరిగిపోయి సహాయం కోసం కేకలు వేసిన రాజీవ్ ను  ఆ అపరిచితుడు సహాయం చేశాడు.  అంబులెన్స్‌కు ఫోన్ చేసి అతన్ని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. దీంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాజీవ్ తండ్రి నేత్రమ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.  తన కోడలు, ఆమె సోదరులపై తన కొడుకును చంపాలనుకుంటున్నారని ఫిర్యాదులో తెలిపాడు. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

రాజీవ్ బరేలీలోని నవోదయ ఆసుపత్రిలో ఒక వైద్యుడి వద్ద అసిస్టెంట్‌గా  పనిచేస్తున్నాడు. అతనికి 2009లో సాధనతో  వివాహం అయింది. ఈ దంపతులకు యష్ (14), లవ్( 8) పిల్లలున్నారు, ఇద్దరూ ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. 

Also Read : తేజశ్వీ యాదవ్‌కు బిగ్‌ షాక్.. ఓటర్‌ లిస్టులో పేరు మిస్సింగ్

సమాజంలో ఇటీవల భర్తలను చంపాలనుకుంటున్న భార్యలకు సంబంధించిన పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసుల్లో ఎక్కువగా వివాహేతర సంబంధాలే ప్రధాన కారణంగా ఉంటున్నాయి.  ఈ ఘటనలన్నీ భార్యాభర్తల మధ్య పెరుగుతున్న మానసిక ఒత్తిడి, వివాహేతర సంబంధాలు, కుటుంబ కలహాలు వంటి సమస్యల తీవ్రతను చూపిస్తున్నాయి.

Uttar Pradesh | telugu-news | wife-killed-husband | national news in Telugu | telugu crime news | latest-telugu-news

Advertisment
తాజా కథనాలు