Tirupati Laddu : 310 ఏళ్లుగా అదే రుచి.. అదే నాణ్యత.... తిరుపతి లడ్డు మొదట ఎలా ఉండేదంటే..?

దేశవ్యాప్తంగా అనేక దేవాలయాల్లో ఇచ్చే ప్రసాదాల్లో తిరుపతి లడ్డుకు ప్రత్యేకత ఉంది. తిరుమల అంటేనే శ్రీవారి లడ్డూ అనేంతలా లడ్డుకు అంతటి ప్రతిష్ట పెరిగింది.ఈ లడ్డూను తిరుపతి లడ్డు, శ్రీవారి లడ్డు లేదా తిరుమల లడ్డు అని కూడా పిలుస్తారు.

New Update
Tirupati Laddu

Tirupati Laddu

దేశవ్యాప్తంగా అనేక దేవాలయాల్లో ఇచ్చే ప్రసాదాల్లో తిరుపతి లడ్డుకు ప్రత్యేకత ఉంది. తిరుమల అంటేనే శ్రీవారి లడ్డు అనేంతలా లడ్డుకు అంతటి ప్రతిష్ట పెరిగింది.ఈ లడ్డూను తిరుపతి లడ్డు, శ్రీవారి లడ్డు లేదా తిరుమల లడ్డు అని కూడా పిలుస్తారు. తిరుమలకు వెళ్లినవారు తప్పకుండా లడ్డు తీసుకురాకుండా ఉండలేరు. కేవలం మనదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ తిరుమల లడ్డుకు మంచి ఆదరణ ఉంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన లడ్డుకు నేటితో 310 ఏండ్లు నిండుకున్నాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న లడ్డు ప్రస్తుతం ఉన్న స్థితికి రావడానికి ఎన్నో ఏళ్లు పట్టింది. అనేక ఏళ్లుగా భక్తుల అభిరుచికి తగినట్లు లడ్డులో మార్పులు చేస్తూ ప్రస్తుతం ఉన్న స్థితికి తీసుకువచ్చారు. రుచి, నాణ్యత,శుభ్రతలో ప్రపంచంలోనే అత్యంత నాణ్యత కలిగిన ప్రసాదంగా నిలిచింది. ఈ లడ్డు రుచి, సువాసన చాలా ప్రత్యేకం, ఎక్కడా దొరకని విధంగా ఉంటుంది. 

Also Read :   రైతుల అకౌంట్లోకి రూ.7000 జమ.. ఇలా చెక్ చేసుకోండి..!

Tirupati Laddu Is 310 Years Old

తిరుమల భక్తులకు లడ్డు ప్రసాదంగా ఇవ్వడం తొలిసారి 1715 ఆగస్టు 2 నుంచి మొదలైంది. భక్తుల అవసరానికి తగినట్లు ప్రతినిత్యం దాదాపు మూడు లక్షల ఇరవై వేల లడ్డులను టీటీడీ తయారు చేస్తోంది. అయితే 2010 వరకు కేవలం రోజుకు లక్ష లడ్డులను మాత్రమే తయారు చేసేవారు. భక్తుల రద్ధీ పెరగడంతో లడ్డుల తయారీని కూడా పెంచారు.తిరుమలలో 15వ శతాబ్దం వరకు వడ ను ప్రసాదంగా ఇచ్చేవారు. ఆ తర్వాత అంటే 17వ శతాబ్ధం నుంచి బుంది లడ్డు ను అందిస్తున్నారు. హథీరాంజీ మఠం నిర్వాహకులు లడ్డులు తయారు చేస్తున్నారు. లడ్డూ శతాబ్దాలుగా అనేక మార్పులకు గురైంది. లడ్డు తయారీలో 600 మందికి పైగా సిబ్బంది పాల్గొంటారు, ఇందులో నైపుణ్యం కలిగిన పాకశాస్త్ర నిపుణులు కూడా ఉంటారు. 

మొదటిసారి 1715 ఆగస్టు 2న శ్రీవారి లడ్డూ ప్రసాదం‌ తయారు చేసినట్లు చెబుతారు.. అయితే ఆ తర్వాత క్రీ.శ.1803లో బూందీగా పరిచయమైంది. అటుతరువాత 1940 నాటికి లడ్డూ ప్రసాదంగా ఇవ్వటాన్ని స్ధిర పరిచారు పండితులు.   తొలిసారి లడ్డు ప్రసాదంగా ఇచ్చినపుడు దాని ధర కేవలం ఎనిమిది నాణేలు మాత్రమే. ప్రస్తుతం లడ్డు ధర 50 రూపాయలు.1940 నుంచి లడ్డును ప్రసాదంగా ఇస్తున్నారు. ఆ సంవత్సరాన్ని‌ ప్రామాణికంగా తీసుకుంటే లడ్డూ వయస్సు 83 సంవత్సరాలుగా చెప్పుకోవచ్చు.

అనేక విశిష్టతలు, ప్రాధాన్యత కలిగిన తిరుపతి లడ్డుకు ట్రేడ్ మార్క్ కూడా ఉన్నాయి. 2009లో తిరుపతి లడ్డుకు భౌగోళిక గుర్తింపు (GI) లభించింది. అంటే, దీని తయారీ విధానాన్ని ఇతర ప్రదేశాలలో అనుకరించకూడదు.2017లో శ్రీవారి వంటకాల శ్రేణిలో భాగంగా, ఇండియా పోస్ట్ తిరుపతి లడ్డూను స్మరించుకునే పోస్టల్ స్టాంపును ఆవిష్కరించింది. అలా లడ్డుకు  దేశంలో ఎంతో ప్రాధాన్యం ఉంది.లడ్డు పోటు అనేది తిరుమల దేవాలయంలోని ఒక ప్రత్యేకమైన వంటశాల, ఇక్కడ లడ్డూలు తయారు చేస్తారు. 

ఆలయాన్ని సందర్శించే సాధారణ యాత్రికులందరికీ ఇచ్చే లడ్డును ప్రోక్తమ్ లడ్డు అంటారు. దీన్ని క్రమం తప్పకుండా పంపిణీ చేస్తారు. ఇది పరిమాణంలో చిన్నది. ఇది 65-75 గ్రాముల బరువు ఉంటుంది. ఈ లడ్డులను పెద్ద సంఖ్యలో తయారు చేస్తారు.ప్రత్యేక పండుగ సందర్భాలలో తయారు చేసే లడ్డును ఆస్తానం లడ్డు అంటారు. దీన్ని పండుగ సందర్భాలలో మాత్రమే తయారు చేస్తారు. ఇది పెద్దదిగా ఉండి 750 గ్రాముల బరువు ఉంటుంది. దీనిని జీడిపప్పు, బాదం మరియు కుంకుమ తంతువులతో తయారు చేస్తారు.

శ్రీవారి లడ్డూకు నకిలీ తీసుకు వచ్చేందుకు అనేక మంద ప్రయత్నించారు. డూప్లికేట్ తయారు చేసి  ఆన్ లైన్ లో విక్రయించేందుకు అనేక సంస్థలు ప్రయత్నించాయి. కానీ తిరుమల లడ్డుతో సరిసమానంగా నిలవలేకపోయాయి. ఆన్ లైన్ లో లడ్డూలను విక్రయించే సంస్థలన్నింటికీ నోటీసులు జారీ చేసి కేసులు నమోదు చేసింది టీటీడీ. ఇటీవల లడ్డు తయారీలో కల్తీ జరుగుతున్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి, అయితే టీటీడీ వీటిని ఖండించింది. 

తిరుపతి లడ్డు తిరుమల, వెంకటేశ్వర స్వామి మరియు భక్తితో ముడిపడి ఉంది, ఇది భక్తులకు ఒక ముఖ్యమైన ప్రసాదం.కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులకు, కొన్ని ఆర్జిత సేవలో పంపిణీ చేసే లడ్డును కళ్యాణోత్సవం లడ్డు అంటారు. ఈ లడ్డులకు భారీ డిమాండ్ ఉంది. ప్రోక్తమ్ లడ్డుతో పోలిస్తే వీటిని చాలా తక్కువ సంఖ్యలో తయారు చేస్తారు.  

Also Read :  కూటమి పొత్తుతో ఫస్ట్ దెబ్బ నాకే.. ఎంపీ సీటు వదిలేసుకున్నా.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు!

tirumala tirupati laddu prasadam | tirupati laddu news | latest-telugu-news | telugu-news | andhra-pradesh-news | national news in Telugu

Advertisment
తాజా కథనాలు