Gas Cylinder Prices: న్యూఇయర్‌ వేళ బిగ్ షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

2026 ప్రారంభం బిగ్ షాక్ ఇచ్చింది. కొత్త ఏడాది మొదటి రోజున చమురు మార్కెటింగ్ కంపెనీలు LPG గ్యాస్ సిలిండర్ల ధరలను గణనీయంగా పెంచాయి. దేశవ్యాప్తంగా 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.111 పెరిగింది.

New Update
Gas Cylinder Goes Up 111 rupees In New Year Shocker

Gas Cylinder Goes Up 111 rupees In New Year Shocker

2026 ప్రారంభం బిగ్ షాక్ ఇచ్చింది. కొత్త ఏడాది(Happy New Year 2026) మొదటి రోజున చమురు మార్కెటింగ్ కంపెనీలు LPG గ్యాస్ సిలిండర్ల(lpg-gas-cylinder) ధరలను గణనీయంగా పెంచాయి. దేశవ్యాప్తంగా 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.111 పెరిగింది. ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబయితో పాటు అన్ని ప్రధాన నగరాల్లో కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. కానీ 14 కిలోల దేశీయ సిలిండర్‌ ధర మాత్రం మారలేదు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిరు వ్యాపారాలపై ప్రభావం పడనుంది. 

Also Read: JIO కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. ఫ్రీగా రూ.35 వేల బెనిఫిట్స్!

Gas Cylinder Goes Up 111 Rupees

కొత్త రేట్ల ప్రకారం చూసుకుంటే 19 కిలోల వాణిజ్యం LPG సిలిండర్ ధర(gas-cylinder-prices) ఇప్పుడు ఢిల్లీలో రూ.1580.50 నుంచి రూ.1691.50కి చేరింది. కోల్‌కతాలో రూ.1684 నుంచి రూ.1795కి పెరిగింది. ముంబైలో గతంలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1531.50 ఉండగా ఇప్పుడు రూ.1642.50కి చేరింది. ఇక చెన్నైలో రూ.1739 నుంచి రూ.1849.50కి పెరిగింది. ఇదిలాఉండగా వాణిజ్య LPG సిలిండర్ల ధరలను డిసెంబర్ 1,2025న తగ్గించారు. ఈ సమయంలో ఢిల్లీ, కోల్‌కతా ధరలను రూ.10 తగ్గించగా.. ముంబై, చెన్నైలో రూ.11 తగ్గించారు. 

Also Read: చెల్లికి క్యాన్సర్ అని నమ్మించి స్నేహితుడికి రూ.2 కోట్లు బురిడి కొట్టించిన కి 'లేడి'

LPG గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు వస్తున్నప్పటికీ దేశీయ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం చాలాకాలంగా స్థిరంగా ఉంటున్నాయి. 14 కిలోల దేశీయ LPG సిలిండర్ ధర ఏప్రిల్ 2025లో ఉన్న స్థాయిలోనే ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో చూసుకుంటే ఢిల్లీలో గృహ వినియోగ సిలిండర్ ధర రూ.853 ఉంది. కోల్‌కతాలో రూ.879, ముంబైలో రూ.852, చెన్నైలో రూ.868కి అందుబాటులో ఉంది. కొత్త ఏడాదిలో వాణిజ్య సిలిండర్ల ధరలు పెరగడంతో ఆహారం, పానీయలు, ఇతర సేవల ధరలు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు